NTV Telugu Site icon

China Rains: చైనాలో భారీ వర్షాలు.. ఎమర్జెన్సీ పొడిగింపు

China Rains

China Rains

చైనాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలో.. రానున్న తుఫాను దృష్ట్యా ఎమర్జెన్సీని పొడిగించారు. అక్కడి వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. రాబోయే వారంలో యాంగ్జీ నది మధ్య, దిగువ ప్రాంతాలలో నిరంతరంగా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన నేపథ్యంలో ఈ అత్యవసర పరిస్థితి ఏర్పడింది.

Eating Dry Fruits: డ్రై ఫ్రూట్స్ను ఇలా తినండి.. ఆరోగ్యానికి చాలా మంచిది

టైఫూన్‌ల కోసం చైనా నాలుగు-స్థాయి అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థను కలిగి ఉంది. లెవల్ I అత్యంత తీవ్రమైనది. ఇదిలా ఉండగా.. హీలాంగ్‌జియాంగ్, హునాన్, జియాంగ్జీలలో భారీ వర్షం మరియు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం ఆదివారం ఉదయం టైఫూన్ కోసం ఆరెంజ్ అలర్ట్ విధించింది. ఆదివారం నుండి సోమవారం మధ్యాహ్నం వరకు.. జియాంగ్సు, అన్హుయ్, హుబే, జెజియాంగ్, యునాన్, గుయిజౌ, గ్వాంగ్జీ మరియు హైనాన్ వంటి ప్రాంతాలలో భారీ వర్షపాతం ఉంటుందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 70 మిమీ లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం ఉంటుందని పేర్కొంది. ఈ క్రమంలో స్థానిక ప్రభుత్వాలు తగిన సన్నాహాలు చేస్తుంది.

TS Inter Supply Results 2024: రేపు తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు..

ఇదిలా ఉంటే.. మధ్య చైనాలోని పర్వత ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఎనిమిది మంది మృతి చెందారని, ప్రతికూల వాతావరణం కారణంగా దేశంలోని కొన్ని ప్రాంతాలను హై అలర్ట్‌లో ఉంచినట్లు స్థానిక మీడియా ఆదివారం తెలిపింది. భారీ వర్షం కారణంగా హునాన్ ప్రావిన్స్‌లోని ఒక గ్రామంలో కొండచరియలు విరిగిపడినట్లు తెలిపింది. ఈక్రమంలో.. నాలుగు ఇళ్లు కూలిపోయాయని, 8 మంది వ్యక్తులు గల్లంతయ్యారు. అలాగే.. శనివారం దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 50 మందికి పైగా మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు.