Site icon NTV Telugu

Heavy Rain: దేశ వ్యాప్తంగా వర్ష బీభత్సం.. పలు ప్రాంతాలకు హెచ్చరికలు

India Rains

India Rains

దేశ వ్యాప్తంగా గత కొన్నిరోజులుగా వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి. దీంతో భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) ప‌లు ప్రాంతాల‌కు హెచ్చరిక‌లు జారీ చేసింది. మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది. రానున్న రెండు రోజుల్లో గోవా, మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతం, కోస్తా కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ బుధవారం తెలిపింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వాతావరణ శాఖ ‘రెడ్ అలర్ట్’ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాయ్ గ‌ఢ్ జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు అధికారులు గురువారం వరకు సెలవు ప్రకటించారు.

Crow Attack on MP: పార్లమెంట్‌ ఆవరణలో ఎంపీపై కాకి దాడి.. వైరల్‌గా మారిన ఫొటోలపై బీజేపీ సెటైర్లు

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు, ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు బియాస్ నది కారణంగా వాయువ్య భారత దేశంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. జూన్ 24న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్ లో 652 ఇళ్లు పూర్తిగా దెబ్బతినగా.. 6,686 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 236 దుకాణాలు, 2,037 గోశాలలు దెబ్బతిన్నట్లు రాష్ట్ర ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ డేటాను ఉటంకిస్తూ పీటీఐ తెలిపింది. జులై 26-27 తేదీలలో హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కార్యాలయం ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, బురదజల్లులు, నదులలో ప్రవాహాలు పెర‌గ‌డం వంటి హెచ్చరికలు చేసింది.

Mehreen Pirzadaa: ఉర్ఫీ జావేద్‌లా తయారైన మెహ్రీన్.. ఇదేం డ్రెస్సురా బాబూ?

మరోవైపు ముంబ‌యి మెట్రోపాలిటన్ ప్రాంతానికి ‘ఆరెంజ్’ అలర్ట్, రత్నగిరి, రాయ్ గ‌ఢ్ ల‌కు ‘రెడ్’ అలర్ట్ ను ముంబ‌యి ప్రాంతీయ వాతావరణ కేంద్రం జారీ చేసింది. అక్కడ గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నా. దీంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహారాష్ట్రలోని రాయ్ గ‌ఢ్ జిల్లాలో బుధవారం ఉదయం 10 గంటల వరకు సగటున 104 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు బుధవారం కలెక్టర్‌ డాక్టర్‌ యోగేష్‌ మహసే సెలవు ప్రకటించారు. మరోవైపు ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల్లో పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల్లో ఇది నెమ్మదిగా వాయువ్య దిశగా కదులుతుందని పేర్కొంది.

Exit mobile version