గార్డెన్ సిటీగా పిలుచుకునే బెంగళూరులో గత రెండు రోజులుగా అకాల వర్షాలు కురుస్తుండంతో నగరం మొత్తం అతలాకుతలమైంది. పలు ప్రాంతాల్లో ఈ వర్షాల దెబ్బకు జన జీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఇదిలా ఉండగా వరద నీరు కారణంగా ఓ బంగారు షాపులోని ఆభరణాలు కొట్టుకుపోయాయి. దీంతో ఆ యజమాని తీవ్రంగా నష్టపోయాడు.
Also Read : DCP Rahul Hegde: నేనెక్కడా తప్పు చేయలేదు.. డింపుల్ ప్రవర్తన అభ్యంతరకరం
మల్లీశ్వర్‌లోని 9వ క్రాస్‌లోని ఓ బంగారం దుకాణం వరద నీటిలో చిక్కుకుంది. కాసేపు తర్వాత షాప్ లోకి భారీగా వరద నీరు రావడంతో అక్కడున్న బంగారు నగలు కొట్టుకుపోయాయి. దాదాపు రెండు కోట్ల రూపాయల విలువైన నగలు కొట్టుకుపోయినట్లు సమాచారం. దుకాణం సమీపంలో జరుగుతున్న పనులే నష్టానికి కారణమని దుకాణం యజమాని ఆరోపిస్తున్నాడు. షాపులోని బంగారు ఆభరణాలు తడిసిపోయాయి.. కార్పొరేషన్‌కు ఫోన్ చేసి సహాయం కోరినా అధికారులు సాయం చేయకపోవడంతో 80 శాతం నగలు మాయమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశాడు.
Also Read : Sairam Sankar: పూరి తమ్ముడి సినిమాకు దర్శకుడు వంశీ పాటలు!
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు కారణంగా నగరంలో భారీ మొత్తంలో వ్యర్థాలు పేరుకుపోయింది. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోడంతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. వ్యర్థాలను తొలగించేందుకు మున్సిపల్ కార్మికులు నానా తంటాలు పడుతున్నారు. బెంగళూరు సిటీలో చెట్లు కూలిపోయాయని, వరద నీరు నిలిచిపోయిందంటూ సుమారు ఇప్పటివరకు 600 వరకు ఫిర్యాదులు అందాయి. అయితే కంటిన్యూగా వర్షం పడుతుండటంతో వ్యర్థాలను తొలగించేందుకు మున్సిపాల్ అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. దీంతో పలు చోట్లు భారీగా చెత్త పేరుకుపోయింది.
