దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలను హెచ్చరిస్తూ లిస్టు విడుదల చేసింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పలు రాష్ట్రాల్లో భారీ వర్షంతో పాటు ఉరుములతో కూడిన హెచ్చరికలు జారీ చేసింది.
మార్చి 29, 30 తేదీల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, జమ్మూకాశ్మీర్, లడఖ్, గిల్గిత్-బాల్టిస్తాన్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇక నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, సబ్‌బ్యాక్‌లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Barrelakka: బర్రెలక్క ఇంట్లో పెళ్లి వేడుక.. వీడియో వైరల్..!
అలాగే హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, హర్యానా, చండీగఢ్, యూపీ, రాజస్థాన్‌లో మార్చి 27-31 తేదీల్లో వర్షాలు కురిసే ఛాన్సుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇటీవల కురిసిన వర్షాలకు పలు ప్రాంతాల్లో ప్రాణ, నష్టం బాగా జరిగింది. చేతికొచ్చిన పంట నష్టపోవడంతో అన్నదాతలు నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ప్రభుత్వాలు ఆదుకోవాలని రైతులు కోరారు. అక్కడకక్కడ ఇళ్లు ధ్వంసమయ్యాయి.
ఇది కూడా చదవండి: Proddatur: ప్రొద్దుటూరుకు చేరుకున్న ‘మేమంతా సిద్ధం’ యాత్ర.. మారుమోగుతున్న సభాప్రాంగణం