Site icon NTV Telugu

Rain Alert: ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..

Rain

Rain

ఏపీకి వాతావరణ శాఖ భారీ వర్షాలు ఉన్నట్లు హెచ్చరించింది. రేపు (ఆదివారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. అలాగే పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందన్నారు.

ఎల్లుండి (సోమవారం) ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తెలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందన్నారు.

PM Modi: రాష్ట్రపతికి అవమానం.. కాంగ్రెస్ “రామమందిర శుద్ధి” వ్యాఖ్యలపై పీఎం ఫైర్..

ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. శనివారం సాయంత్రం 7 గంటల నాటికి కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో 28.2 మిమీ, తిరుపతి జిల్లా పుత్తూరులో 27.2మిమీ, కాకినాడ ప్రత్తిపాడులో 14మిమీ, తిరుపతి జిల్లా కుమార వెంకట భూపాలపురంలో 11.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.

రేపు 46 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ తెలిపారు. శ్రీకాకుళం 14 , విజయనగరం12, పార్వతీపురంమన్యం 11, అల్లూరి సీతారామరాజు 4, కాకినాడ 3, తూర్పుగోదావరి 2 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. శనివారం నంద్యాల జిల్లా చాగలమర్రి, విజయనగరం జిల్లా రాజాం, వైయస్ఆర్ జిల్లా సింహాద్రిపురం 41.5, అల్లూరి జిల్లా యెర్రంపేటలో 41.4, కర్నూలు జిల్లా జి. సింగవరంలో 41.1, తూర్పుగోదావరి జిల్లా గోకవరం 40.8, అనంతపురం జిల్లా తెరన్నపల్లి, పల్నాడు జిల్లా రావిపాడులో 40.6 అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

Exit mobile version