Site icon NTV Telugu

Himachal Rains: హిమాచల్‌ను వదలని వర్షాలు.. 6 జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక

Himachal Rians

Himachal Rians

గత కొన్ని వారాలుగా హిమాచల్ ప్రదేశ్ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే వారి కష్టాలు ఇప్పట్లో తగ్గేట్టు కనిపించడం లేదు. మండి సహా రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అంతేకాకుండా సిర్మౌర్‌లో వరద హెచ్చరిక జారీ చేశారు.

Breakfast: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కూడా

మండి, బిలాస్‌పూర్, చంబా, కాంగ్రా, సోలన్, సిర్మౌర్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం రాత్రి నుండి వాయువ్య భారతదేశాన్ని తాజా పశ్చిమ భంగం ప్రభావితం చేయవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో సెప్టెంబర్ 21 వరకు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దిగువ, మధ్య కొండలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు.. ఎత్తైన ప్రాంతాలలో మోస్తరు వర్షం లేదా మంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల దృష్ట్యా.. రైతులు పంటలు, పండ్లకు నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

Jyotiraditya Scindia: రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చారా..? రాహుల్‌పై విమర్శనాస్త్రాలు

వాతావరణ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. హిమాచల్ ప్రదేశ్‌లో జూన్ 1, సెప్టెంబర్ 15 మధ్య రుతుపవనాల సమయంలో మొత్తం 840.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈసారి హిమాచల్‌లో సాధారణ వర్షపాతం (689.6 మి.మీ) కంటే 22 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉంటే.. భారీ వర్షాలు కురవడంతో.. కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా రాష్ట్రానికి సుమారు రూ.8,680 కోట్ల నష్టం వాటిల్లింది. జూన్ 24 నుంచి సెప్టెంబర్ 13 వరకు రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుండి వర్షం, సంబంధిత సంఘటనల కారణంగా సుమారు 272 మంది మరణించారు. ఇటీవల.. హిమాచల్ లో వర్షం, కొండచరియలు విరిగిపడిన అనేక చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Exit mobile version