Heavy Rain Alert: ఏపీ వాసులకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rain Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వర్షాలతో పాటు పలు చోట్ల బలమైన ఈదురు గాలులు వీస్తూ, తీవ్రస్థాయిలో పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని వివిధ జిల్లాల తీవ్రతను బట్టి ముందస్తు జాగ్రత్తగా కలర్ అలర్ట్‌లను ప్రకటించారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీ చేశారు. అలాగే కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow Alert) ప్రకటించారు. అటు తీర ప్రాంత జిల్లాలైన బాపట్ల, నెల్లూరుతో పాటు రాయలసీమ వ్యాప్తంగా ఉన్న పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడటంతో పాటు భారీగా పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు పలు కీలక సూచనలు చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు, గొర్రెల కాపరులు, కూలీలు ఎవరూ కూడా బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరించింది. పిడుగుపాటు ప్రమాదం ఉన్నందున చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడవద్దని, సురక్షితమైన పక్కా భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ స్థానిక అధికారుల ఆదేశాలను పాటించాలని విజ్ఞప్తి చేసింది.
Also Read
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!