Site icon NTV Telugu

Rain in Hyderabad: హైదరాబాదీలు జాగ్రత్త.. పలు చోట్ల వర్షం.. జలమయమైన రహదార్లు..!

Rain In Hyderabad

Rain In Hyderabad

Rain in Hyderabad: భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం కాస్త ఎండగా ఉన్నా, అంతలోనే ఆకాశం మేఘావృతం కావడంతో ఉన్నట్టుండి వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. బోరబండ, రెహమాత్ నగర్, యూసఫ్ గూడా, ఎర్రగడ్డ ప్రాంతాలలో వర్షం కురిసింది. అలాగే, కోఠి, బషీర్ బాగ్, హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాలలో మోస్తారు వర్షపాతం నమోదైంది.

Hyderabad ORR Tragedy: హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై మరో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా..

అలాగే నగరంలోని ప్రధాన ప్రాంతాలైన మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం, హఫీజ్‌పేట్‌లో భారీ వర్షం పడింది. మియాపూర్, చందానగర్, బీహెచ్ఈఎల్, మదినగూడ, నిజాంపేట్, బాచుపల్లి, దుండిగల్, మల్లంపేట ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షం కురిసింది. దీంతో రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక పలు ప్రాంతాలలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు నెమ్మదిగా కదలడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం.. అల్ప పీడనం కారణంగా నగరంలో ఒకటి లేదా రెండు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Prashanth Neel : ఫైనల్‌గా ప్రశాంత్ నీల్ డార్క్ లుక్‌కు బ్రేక్.. భార్య లిఖితా ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Exit mobile version