Site icon NTV Telugu

Breaking: హైదరాబాద్‌లో భారీ వర్షం..

Rain

Rain

హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం పడుతుంది. మధ్యాహ్నం ఎండగా ఉన్నప్పటికీ.. ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారింది. మేఘాలు నల్లగా కమ్ముకున్నాయి. దీంతో.. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నారాయణగూడ, హిమాయత్ నగర్, బషీర్ బాగ్, అబిడ్స్, కోఠి పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సరూర్ నగర్, కొత్త పేట, మలక్‌పేట పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతుంది. జూబ్లీహిల్స్, మాదాపూర్, యూసఫ్ గూడ, కీసర, ఘట్ కేసర్, అబ్దుల్లాపూర్ మెట్, నాంపల్లి, ఖైరతాబాద్, నాంపల్లి, దిల్ సుఖ్ నగర్, శివరాంపల్లి తదితర ప్రాంతాల్లో జోరు వాన పడుతుంది. అయితే ఈరోజు సద్దుల బతుకమ్మ కావడంతో సాయంత్రం పూట ఆడుకోవడనికి వెళ్లే వారికి కొంచెం ఇబ్బంది కలగనుంది.

Exit mobile version