NTV Telugu Site icon

Hyderabad Rains : భాగ్యనగరంలో భారీ వర్షం.. రాత్రి మరోసారి వర్ష సూచన

Rain

Rain

వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసిన కొన్ని గంటల తర్వాత, సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది . కొండాపూర్, హైటెక్ సిటీ, గుడిమల్కాపూర్, అత్తాపూర్, హైదర్‌గూడ, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల వాసులు కుండపోత వర్షం కురిసిందని సోషల్ మీడియాలో వీడియోలను షేర్ చేశారు. మాదాపూర్‌, గచ్చిబౌలి, దుర్గం చెరువు, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, అమీర్‌పేట్‌, పంజాగుట్ట, యూసుఫ్‌గూడ, బేగంపేట్‌ ఏరియాల్లో వర్షం కురిసింది. దక్షిణ హైదరాబాద్‌లో ప్రారంభమైన వర్షం పడమటి వైపు విస్తరించింది.

ఖైరతాబాద్, రాజేంద్రనగర్, లింగంపల్లి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కాగా, ఆదివారం నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 34.4 డిగ్రీల సెల్సియస్‌, కనిష్ట ఉష్ణోగ్రత 25.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. IMD ప్రకారం, జూన్ 18 నాటికి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటాయి, ఆపై జూన్ 21 నాటికి 33 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గుతాయి. అయితే.. మరోసారి హైదరాబాద్‌కు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

సిటీలో రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ లో దాదాపు అర్ధగంట పాటు దంచికొట్టిన వర్షానికి రోడ్లపైకి వర్షపు నీరు చేరి వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జీహెచ్‌ఎంసీ బృందాలు అప్రమత్తమయ్యాయి.. అంతేకాకుండా.. అవసరం ఉంటేనే బయటకు రావాలని హైదరాబాద్ వాసులకు ఐఎండీ సూచించింది.

కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు రహదారులు జలమయమవడంతోడిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (డీఆర్‌ఎఫ్‌)బృందాలను రంగంలోకి దించి నీటి నిల్వలను తొలగించి, కూలిన చెట్లను తొలగించారు. ఉప్పల్‌లోని ఆదిత్య ఆసుపత్రి ఎదురుగా నిలిచిన నీటిని తొలగించేందుకు జీహెచ్ఎంసీ స్టాటిక్ టీమ్‌లు కూడా రంగంలోకి దిగాయి. ఉప్పర్‌పల్లి, శివరాంపల్లి, పరిసర ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. అనేక పారిశుధ్యం మరియు HMWSSB బృందాలు కూడా నీటిని క్లియర్ చేస్తున్నాయి.