వాతావరణంలో మార్పుల కారణంగా భారీవర్షాలు ముంచెత్తుతున్నాయి. అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో సోమవారం అర్థరాత్రి కుండ పోత వర్షం కురిసింది. వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి మండలంలో 92 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. గ్రామ సమీపంలోని చెరువులు, కుంటలు నిండడంతో వడ్రవన్నూరు, ఉడే గోళం తదితర గ్రామాలతో పాటు రాయదుర్గం పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. షాపుల్లోకు నీరు చేరుకోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యాపారస్తులు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో ఈ సమస్య నెలకొంది.
Read Also: Ganesh Chaturthi: వినాయకచవితి నాడు చంద్రుడిని ఎందుకు చూడకూడదు?
అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలో సోమవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షానికి వడ్రవన్నూరు గ్రామం వద్ద పారిన వంకలో ఆటో కొట్టుకుపోయింది. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు సిద్దేశ్వర కాలనీ ,పార్వతి నగర్, కొలిమి వీధి ,రామస్వామి వీధి ,లక్ష్మీ బజార్, మధు టాకీస్ ఏరియా తదితర లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వాహన రాకపోకలు స్తంభించి పోయాయి.
రాయదుర్గం మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో తమ ఇళ్లల్లోకి నీరు చేరుకుంటుందని ప్రజలు వాపోతున్నారు. రాత్రి నుంచి ఇంటిలోకి నీరు చేరుకోవడంతో తిండి, నిద్రలేక అవస్థలు పడుతున్నట్లు బాధితుల పేర్కొన్నారు. వర్షం నీరు ఇంట్లోకి చేరుకోవడంతో నిత్యావసర సరుకులు మొత్తం నీటిపాలయ్యాయని మండిపడుతున్నారు. ఎలక్ట్రిక్ పరికరాలు దెబ్బ తినడంతో లక్షలరూపాయలు నష్టం వాటిల్లిందంటున్నారు. గత 25 సంవత్సరాల నుంచి ఈ దుస్థితి నెలకొందని, అధికారులు కానీ, ప్రజా ప్రతినిధులు గాని పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థను సరి చేస్తే తప్ప ఈ తిప్పలు తప్పవని మున్సిపాలిటీ అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Read Also: Warangal Ganesh Festival: గణేష్ నవరాత్రి ఉత్సవాలకు పోలీసు అనుమతి తప్పనిసరి