Site icon NTV Telugu

Weather Update: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. అల్ప పీడనం ఏర్పడే అవకాశం!

Weather Latest Update

Weather Latest Update

Weather Update: తెలుగు రాష్ట్రాలకు మరోసారి విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఇందులో భాగంగా కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదవుతాయి. ఇప్పటికే ఉపరితల ఆవర్తనం ప్రభావం కొనసాగుతుండగా.. పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని అల్ప పీడనం ఏర్పడే అవకాశం వుంది. ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో ఇప్పటికే దుకు వాతావరణం అనుకూలంగా మారింది. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది.

Netanyahu: ఇజ్రాయెల్ ప్రధాని సంచలన ప్రకటన.. పాలస్తీనా దేశంగా ఉండబోదని ప్రతిజ్ఞ

పశ్చిమ గోదా వరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోన సీమ, తూర్పు గోదావరి, కృష్ణా, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Charlie Kirk Murder: చార్లీ కిర్క్ హత్య కేసు నిందితుడి ఫొటో విడుదల.. వయస్సు ఎంతంటే ..!

Exit mobile version