NTV Telugu Site icon

Rain Alert: హైదరాబాద్ కు వర్ష సూచన.. సాయంత్రం భారీ వాన

Rain

Rain

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో నేడు రేపు రాష్ట్రానికి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని సూచించింది. తెలంగాణలోని ఉత్తర తూర్పు జిల్లాలలో నేడు భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. హైదరాబాద్ తో పాటు పదిహేను జిల్లాకు వెదర్ డిపార్ట్మెంట్ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ కు సైతం నేడు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో సాయంత్రం 7 తరువాతే వర్షం కురుస్తుందని తెలిపింది.

Read Also: Ramesh Bidhuri: ముస్లిం ఎంపీపై అనుచిత వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీపై స్పీకర్ సీరియస్

అలాగే, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నేడు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతాయని ఐఎండీ ప్రకటించింది. ముఖ్యంగా ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కురిసే వర్ష పాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇక, మహబూబాబాద్, జనగాం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. దీంతో పాటు హైదరాబాద్ కు ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Read Also: Sai Pallavi: డైరెక్టర్ తో సాయి పల్లవి సీక్రెట్ పెళ్లి.. సాయి పల్లవి రియాక్షన్ ఇదే ..!