NTV Telugu Site icon

Heavy Rain Forecast: ఏపీకి భారీ వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో.. రేపు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..!

Ap Rains

Ap Rains

Heavy Rain Forecast: ఆంధ్రప్రదేశ్‌కి భారీ వర్ష సూచన చేసింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా.. సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారానికి తెరపడింది.. ఇక ఎన్నికల్లో రేపు కీలకగట్టమైన పోలింగ్‌ జరగనుండగా.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తోంది వాతావరణశాఖ.. ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. అలాగే పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Read Also: Right to Vote: ఓటు వేసే సమయంలో ఇలాంటి పనులు చేస్తే.. జైలుకే..!

మరోవైపు.. రేపు ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తెలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని.. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు వాతావరణశాఖ అధికారులు.. మరోవైపు ఈ రోజు 46 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. శ్రీకాకుళం 14 , విజయనగరం12, పార్వతీపురంమన్యం 11, అల్లూరి సీతారామరాజు 4, కాకినాడ 3, తూర్పుగోదావరి 2 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.