Site icon NTV Telugu

Weather Updates : తెలంగాణలో పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడా వడగళ్ల వాన

Rain

Rain

ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను అకాల వర్షాలు తుడిచిపెట్టుకుపోతున్నాయి. దీంతో రైతున్నలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చేతికి వచ్చిన వరిపంట నీటిలో కొట్టుకుపోవడంతో.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఉమ్మడి వరంగల్‌ జిల్లాతో పాటు కరీంనగర్‌లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. నిన్న కురిసిన అకాల వర్షాలకు పంటలు తీవ్రంగా నష్టపోయాయి. మామిడిచెట్లకు ఉన్న కాయల నేలరాలాయి. దీంతో.. వేలాది ఎకరాల్లో వరి, మామిడి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. వరుసగా వడగండ్ల వర్షం ఈదురుగాలులతో మామిడి పూర్తిగా నేలరాలింది.

Also Read : Software Engineer : ఛీ దీనమ్మ జీవితం.. ఏడాదికి రూ.58లక్షల జీతం.. అయిన ఒక్క గర్ల్ ఫ్రెండ్ లేదు

ఇదిలా ఉంటే.. కరీంనగర్ జిల్లా చొప్పదండి, కరీం నగర్ రూరల్ మండలంతో సహా రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో జరిగిన నష్టాన్ని అంచనావేసేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి దెబ్బతిన్న పంటలకు సంబంధించిన వివరాలతో కూడిన నివేదికలు తెప్పించాలని సిఎం తెలిపారు.

Exit mobile version