Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద.. గేట్లు ఎత్తేది ఎప్పుడు..?
- శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న భారీ వరద
- ప్రస్తుత నీటిమట్టం 853.20 అడుగులు
- ప్రస్తుత నీటి నిల్వ 87.2476 టీఎంసీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam Project: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆయా ఉప నదులు కూడా జోరుగా ప్రవహిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదలో కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. రోజురోజుకు శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పెరుగుతోంది. శ్రీశైలం జలాశయానికి 1,93,803 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. 31,784 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాగా.. కుడి గట్టు జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి చేయడం లేదు. శ్రీశైలం డ్యామ్ పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 853.20 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 87.2476 టీఎంసీలుగా ఉంది. వరద ప్రవాహం కొనసాగుతున్న క్రమంలో.. నీటినిల్వలు క్రమంగా పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
Read Also: Dowleshwaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
శ్రీశైలం జలాశయం నిండడానికి మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. పూర్తిస్థాయిలో డ్యామ్ నిండాలంటే పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు నీరు చేరాల్సి ఉంటుంది. ప్రాజెక్టుకు సంబంధించి తాజా పరిస్థితి చూస్తే.. ఇప్పుడే గేట్లు ఎత్తే పరిస్థితి కనిపించడం లేదు. కృష్ణమ్మ మరింతగా పరవళ్లు తొక్కితేగానీ శ్రీశైలం జలాశయం నిండనుంది. అప్పుడు మాత్రమే గేట్లను ఎత్తనున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో శ్రైశైలంలో గేట్లు ఎప్పుడు ఎత్తుతారని యాత్రికులు ఎదురుచూస్తూ ఉంటారు. గేట్లు ఎత్తినప్పుడు భారీ స్థాయిలో పర్యాటకులు తరలివస్తారు.
దిగువన ఉన్న నాగార్జున సాగర్ జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. సాగర్‌కు 9500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండగా.. 9500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 503.80 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 121.38 టీఎంసీలుగా ఉంది. ఇదిలా ఉండగా.. తాజాగా నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదలను ప్రాజెక్టు అధికారులు నిలిపివేసినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!