Srisailam and Nagarjuna Sagar: కృష్ణమ్మ పరవళ్లు.. మరోసారి శ్రీశైలం, నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత

  • కృష్ణా నదిలో పెరిగిన వరద..
  • మరోసారి శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత..
  • ఈ ఏడాది వరుసగా మూడోసారి గేట్లు ఎత్తిన అధికారులు..
Srisailam And Nagarjuna Sag

Srisailam And Nagarjuna Sag

Srisailam and Nagarjuna Sagar: ఓవైపు వర్షాలు, మరోవైపు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో కృష్ణా నదిలో వదర ప్రభావం కొనసాగుతోంది.. దీంతో, ఈ ఏడాదిలోనే వరుసగా మూడోసారి శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు అధికారు.. శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుండగా.. ఈ ఏడాదిలో మూడోవ సారి రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తారు అధికారులు.. జలాశయం నాలుగు గేట్లను 10 అడుగులు మేర ఎత్తి దిగువన నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు.. ఇక, శ్రీశైలం డ్యామ్‌కు ఇన్ ఫ్లో రూపంలో 2,23,802 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. ఔట్ ఫ్లో 1,73,651 క్యూసెక్కులుగా ఉంది.. ఇక, శ్రీశైలం డ్యామ్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 883 అడుగులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు అయితే.. ప్రస్తుత నీటినిల్వ 204.7889 టీఎంసీలుగా ఉందని.. మరోవైపు కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.. దీంతో, మొత్తం 1,73,651 క్యూసెక్కులు నీరు ఔట్‌ఫ్లో రూపంలో ప్రాజెక్టు నుంచి వెళ్తుంది..

Read Also: Vienna Convention: వియన్నా కన్వెన్షన్ అంటే ఏమిటి?.. దీనిపై పాకిస్తాన్‌కు చాలాసార్లు గుణపాఠం నేర్పిన భారత్

ఇక, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు వరద కొనసాగుతుండగా.. 4 క్రస్ట్ గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇన్ ఫ్లో 66,123 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 75,142 క్యూసెక్కులుగా ఉంది.. ప్రస్తుత నీటి మట్టం 589.40 అడుగులు కాగా.. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు.. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు అయితే, ప్రస్తుత సామర్థ్యం 310.2522 టీఎంసీలుగా ఉంది.. అయితే, ఇప్పుడు శ్రీశైలం గేట్లు ఎత్తడంతో.. ఇన్‌ఫ్లో పెరుగుతుంది.. దాదాపు 1.73 లక్షల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండడంతో.. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో మరిన్ని గేట్లను ఎత్తేందుకు సిద్ధంగా ఉన్నారు అధికారులు..