NTV Telugu Site icon

Drugs: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత

Drgus

Drgus

హైదరాబాద్ లో మరో సారి భారీగా డ్రగ్స్ ని అధికారులు పట్టుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అడ్డగా కొనసాగుతున్న డ్రగ్స్ దందాకి అధికారులు ఫుల్ స్టాప్ పెట్టారు. లావోస్ నుంచి హైదరాబాద్ కి వచ్చిన నలుగురు మహిళల నుంచి 5 కిలోలకు పైగా కోకాన్ ను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 50 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ ని పట్టుకున్నట్టు డైరెక్టర్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. నలుగురు లేడీస్ హ్యాండ్ బ్యాగులతో పాటు ఒక సూట్ కేస్ లోని కింది భాగంలో ఈ డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించిన అధికారులు దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. లావోస్ నుంచి సింగపూర్ మీదుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు నలుగురు మహిళలు చేరుకున్నారు.

Read Also: India vs Pakistan LIVE Score, Asia Cup 2023: దూకుడుగా ఇషాన్ కిషన్.. హార్ధిక్ అర్థ శతకం

ఈ నలుగురి దగ్గర అనుమానాస్పద వస్తువులు కనిపించడంతో వారిని తనిఖీలు చేయగా డ్రగ్స్ బయట పడ్డాయి. లేడీస్ హ్యాండ్ బ్యాగ్ లోని కింది భాగంలో డ్రగ్స్ ని ఆమార్చారు. అదే మాదిరిగా ట్రాలీ బ్యాగ్ లో అడుగు భాగంలో డ్రగ్స్ పెట్టారు. మొత్తం నాలుగు హ్యాండ్ బ్యాగ్స్ తో పాటు ఒక ట్రాలీబాగాలో ఐదు కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే, సింగపూర్ నుంచి వచ్చే విమానాల తనిఖీలు తక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో సింగపూర్, అక్కడి నుంచి ఢిల్లీకి.. అక్కడి నుంచి లోకల్ ఫ్లైట్ లో హైదరాబాద్ చేరుకున్నారు. లోకల్ ఫ్లైట్లో హైదరాబాద్ కి వచ్చిన తర్వాత నలుగురు మహిళల కదలికలపైన అధికారులకు డౌట్ రావడంతో వారి చెక్ చేయడంతో ఈ డ్రగ్స్ గుట్టు బయట పడింది.

Read Also: Uttar Pradesh: వింత శబ్దం చేస్తున్న చిన్నారి.. చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు

దీంతో నలుగురు మహిళలని డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే హైదరాబాద్ కు తీసుకువచ్చిన డ్రగ్స్ ఎవరికి ఇస్తున్నారనే దానిపైన అధికారులు విచారణ చేస్తున్నారు. తమకు లావోస్ ఎయిర్ పోర్ట్ లో కొంత మంది కలిసి కొన్ని డబ్బులు ఇచ్చి దీనిని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో డెలివరీ చేయాలని చెప్పినట్లుగా అధికారులు సదరు మహిళలు వెల్లడించారు. అయితే లాగోస్ లో మహిళలకు డ్రగ్స్ ఇచ్చిన వారెవరు హైదరాబాద్ లో డ్రస్సు తీసుకునే వారు ఎవరు అనేదానిపై అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. డ్రగ్స్ దందాను కట్టడి చేసేందుకు అధికారులు ఎప్పటికప్పుడే చర్యలు తీసుకుంటున్నప్పటికీ పెద్ద మొత్తంలో డ్రగ్స్ హైదరాబాద్ కు చేరుకోవడంపై ఆందోళన వ్యక్తం అవుతుంది.