Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై ఆషాఢ సారె ఉత్సవాలు అత్యంత వైభవంగా కోలాహలంగా సాగుతున్నాయి. ఆషాఢ మాసం ఐదవ రోజు ఉత్సవాలతో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో దుర్గమ్మను దర్శించుకునేందుకు, సారె సమర్పించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యంగా మహిళా భక్తులు ఇంద్రకీలాద్రికి వెల్లువలా పోటెత్తారు. ఘాట్ రోడ్, కనకదుర్గ నగర్ మార్గాల ద్వారా ఉదయం 7 గంటల నుంచే భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. మధ్యాహ్నం 3 గంటల సమయానికే దాదాపు 65 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, వారిలో కేవలం ఆషాఢ సారె సమర్పించేందుకే 57 బృందాలుగా 23,916 మంది భక్తులు విచ్చేశారు.
ఈ భారీ రద్దీని క్రమబద్ధీకరించేందుకు ఆలయ అధికారులు సరికొత్త సాంకేతికతను ఉపయోగించారు. డిజిటల్ స్కానింగ్ విధానం ద్వారా క్యూ లైన్లను పర్యవేక్షిస్తూ భక్తుల రద్దీని నియంత్రించారు. కింద రిజిస్ట్రేషన్ కాగానే కొండపై ఉన్న స్కానింగ్ పాయింట్‌కు తక్షణ సమాచారం అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనివల్ల భక్తుల నిరీక్షణ సమయం తగ్గింది. ముఖ్యంగా సారె సమర్పించే భక్తుల సౌకర్యార్థం ‘భవాని అనుగ్రహ దర్శన్’ (రూ. 100) క్యూ లైన్‌ను పూర్తిగా వారికే కేటాయించారు. అలాగే ఇతర క్యూ లైన్లలో కూడా సారె భక్తులను అనుమతించారు. దీంతో మహామండపం 6వ అంతస్తు భక్తులతో పూర్తిగా కిక్కిరిసిపోయింది. వచ్చిన భక్తులందరికీ ఆలయ అధికారులు ఉచిత ఆశీర్వచనం, ప్రసాద వితరణ చేశారు.
Also Read
- Mamata Banerjee: బెంగాల్లో మళ్లీ ఎన్నికలు, జ్ఞానేశ్ కుమార్ అరెస్టు.. మమత సంచలన డిమాండ్..
- Best Places to Visit in India in October: అక్టోబర్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 10 ప్రదేశాలు అస్సలు మిస్ కావొద్దు..
- Meloni: యూఎన్‌కు మెలోనీ దూరం.. ట్రంప్‌ను కలవడం ఇష్టం లేకనేనా?
- BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడానికి అంతరాలయ దర్శనాలను, అలాగే ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు వీఐపీ దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేశారు. అన్ని రకాల దర్శన టికెట్లను రద్దు చేసి ఉచిత దర్శనాలుగా మార్చారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లలోనే మొబైల్ వాటర్ క్యాన్ల ద్వారా భక్తులకు చల్లని తాగునీరు అందించారు. ఈ ఏర్పాట్లన్నింటినీ ఆలయ ఈవో శీనా నాయక్ స్వయంగా క్షేత్రస్థాయిలో బ్యాటరీ వాహనాలు, ప్రోటోకాల్ కార్యాలయం, ప్రధాన ఆలయ పరిసరాల్లో పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు.
తాజావార్తలు
-
Baahubali : ఫౌజీ మరో బాహుబలి?
-
Mamata Banerjee: బెంగాల్లో మళ్లీ ఎన్నికలు, జ్ఞానేశ్ కుమార్ అరెస్టు.. మమత సంచలన డిమాండ్..
-
Gautam Adani: అంబానీని దాటేసిన అదానీ.. మళ్లీ దేశంలోనే నంబర్ 1 ధనవంతుడిగా రికార్డ్!
-
Best Places to Visit in India in October: అక్టోబర్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 10 ప్రదేశాలు అస్సలు మిస్ కావొద్దు..
-
Meloni: యూఎన్‌కు మెలోనీ దూరం.. ట్రంప్‌ను కలవడం ఇష్టం లేకనేనా?
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!