NTV Telugu Site icon

Heat Wave Alert: ఎండ తీవ్రత, వడగాల్పులు.. అత్యవసరం అయితేనే బయకు రండి..!

Ap Heat Wave

Ap Heat Wave

Heat Wave Alert: ఎండలు మండిపోతున్నాయి.. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఇదే సమయంలో.. వడగాల్పులు విరుచుకుపడుతున్నాయి.. దీంతో, అత్యవసరం అయితేనే బయటకు రావాలని హెచ్చరిస్తున్నారు వాతావరణ నిపుణులు.. నేడు ఆంధ్రప్రదేశ్‌లోని మన్యం జిల్లా కొమరాడ, వైఎస్ఆర్ జిల్లా చాపాడు, వీరపనాయునిపల్లె, కమలాపురం, వల్లూరు, ముద్దనూరు, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు మండల్లాలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని.. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం అధికంగా ఉంటుందని.. ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని.. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌.

Read Also: CM KCR: ఈసారి ఎన్నికల్లో 95 నుంచి 105 సీట్లు బీఆర్ఎస్‌కే

ఇక, నేడు విజయనగరం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.. పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు, వైఎస్ఆర్, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43 డిగ్రీ నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండగా.. శ్రీకాకుళం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 38 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.. మరోవైపు.. నిన్న నెల్లూరు జిల్లా వెంకటాచలంలో 46 డిగ్రీలు, తిరుపతి జిల్లా ఏర్పేడులో 46 డిగ్రీలు, పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 45.9 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.. వైఎస్ఆర్ జిల్లా 4 మండల్లాలో తీవ్రవడగాల్పులు, మిగిలిన చోట్ల మొత్తం 38 మండలాల్లో వడగాల్పులు వీచినట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.