Telangana : నేడు తెలంగాణ హైకోర్టులో ప్రభాస్, చిరంజీవి సినిమాల టికెట్ రేట్ల పెంపుపై విచారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతికి విడుదల కాబోతున్న రెండు భారీ సినిమాలకు ఊహించని న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాల టికెట్ ధరలు, అదనపు షోస్ ప్రదర్శించేందుకు హైకోర్టును ఆశ్రయించారు. సంక్రాంతి పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు సిద్ధమైన పెద్ద సినిమాలకు హైకోర్టులో టికెట్ ధరల పెంపు, అదనపు షోల అనుమతిపై సింగిల్ బెంచ్ జడ్జి అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో టికెట్ ధరలు పెంచకుండా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులన సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు చిత్ర నిర్మాతలు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాలకు సాధారణ ధరలతో వసూళ్లు రాబట్టడం కష్టమని ఆ ఉత్తర్వులను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ డివిజన్ బెంచ్‌కు అప్పీల్ చేసారు.
తమ చిత్రాలకు సంబంధించి టికెట్ ధరల పెంపు మరియు అదనపు షోల కోసం ఇప్పటికే రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నామని, ఈ విజ్ఞప్తిని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించేలా హోంశాఖకు ఆదేశాలు ఇవ్వాలని నిర్మాతల తరపు న్యాయవాదులు పిటిషన్లో కోరారు. సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నందున ఈ కేసు నేడు విచారణను రానుంది. నేడు హైకోర్టులో జరిగే విచారణపై చిత్ర నిర్మాతలతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.కోర్టు సానుకూలంగా స్పందించి టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మొదటి రోజు భారీ వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంది. ఒకవేళ కోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టుస్వాగతిస్తే మాత్రం నిర్మాతలకు, పంపిణీదారులకు భారీ నష్టాలు తప్పదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నేడు జరగబోయే విచారణలో హైకోర్టు ఎలాంటి తీర్పు ఎలా ఉంటుందోననే టెన్షన్ నిర్మాతలతో పాటు ఇటు ఫ్యాన్స్ లోను ఉంది.
Also Read
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
- India vs Afghanistan: భారత్‌కు కలిసొచ్చిన వర్షం.. మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!
- Gold and Silver Prices Fall: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..
- Lovely Professional University: క్యాంపస్‌లో చెలరేగిన హింస.. 10 రోజుల పాటు క్లాసులు బంద్, మిడ్‌టర్మ్ పరీక్షలు వాయిదా!
తాజావార్తలు
-
SS Rajamouli-Varanasi: జక్కన్న లెక్కలు మారాయి.. ‘వారణాసి’ ఆ మార్క్ అందుకుంటుందా?.. ఇప్పటివరకు ఒకే ఒక్క మూవీ!
-
Love And War : ‘లవ్ అండ్ వార్’ను విడిచిపెట్టని లీక్స్
-
The Paradise : ఈరోజు నుండి నాని సినిమా అసలు రంగు ఏంటో తెలియనుందా?
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
World Rabies Day 2026: కుక్క కాటు నుంచి ఎలా తప్పించుకోవాలి?.. WHO సూచించిన ముఖ్యమైన జాగ్రత్తలు
ట్రెండింగ్
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!