Site icon NTV Telugu

Telangana Group1 Exam: తెలంగాణ గ్రూప్‌-1 పరీక్షపై ఈ రోజే విచారణ.. అభ్యర్థుల్లో ఆందోళన

Untitled 9

Untitled 9

Education: తెలంగాణ గ్రూప్-1 పరీక్ష రద్దయిన విషయం అందరికి సుపరిచతమే. ఈ నేపథ్యంలో అటు అభ్యర్ధులు ఇటు TSPSC కమిషన్‌ ఆందోళన చెందుతుంది. ఇప్పటికే రెండుసార్లు నిర్వహించగా అభ్యర్థులు ఈ పరీక్షను రాసారు. ఈ నేపథ్యంలో మూడవసారి కూడా రాయాలంటే వ్యయప్రయాసలతో కూడుకున్న విషయం. అంతేకాదు అభ్యర్థులు మానసిక వేదనకు గురవుతారని ఈ పరీక్ష రద్దు పైన మళ్ళీ విచారణ జరపాలి అని హైకోర్టుకి సెప్టెంబర్‌ 25 అప్పీల్‌ చేసింది TSPSC కమిషన్‌. ఈ విషయం పైన అత్యవసర విచారణ చేపట్టాలని కోరింది. కాగా అందుకు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు విచారణ జరగనుంది. కాగా ఈ విషయం పైన ఎలాంటి తీర్పు వస్తుందో అని అందరిలో ఉత్కంఠత నెలకొంది.

Read also:Mineral water: మినరల్ వాటర్ వేడి చేసి తాగవచ్చా?

పరీక్ష నిర్వాహణలో అవకతవకలు జరిగాయని కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు అభ్యర్థుల మనవిని అంగీకరిస్తూ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేసింది. కాగా ఇప్పుడు ఈ విషయం పైన తిరిగి విచారణ జరుపుతున్న నేపథ్యంలో పరీక్షను రద్దు చేస్తారా? లేక చెయ్యరా? అని అందరిలో ఆందోళన కలుగుతుంది. కొందరు అభ్యర్థులు ఈ పరీక్షను రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు అభ్యర్థులు మరియు TSPSC కమిషన్‌ ఈ పరీక్ష రద్దు చేయొద్దని కోరుకుంటుంది. ఇంత సున్నితమైన విషయం పైన కోర్టు ఎలాంటి తీర్పుని ఇస్తుందో అనేది ప్రస్తుతం అందరిలో ఉండే సందేహం. పరీక్ష రద్దు కావాలని కొందరు. రద్దు కాకూడదు అని మరికొందరు. ఎవరి ఆశ నెరవేరుతుందో చూడాలి.

Exit mobile version