Site icon NTV Telugu

AP Speaker: ఇవాళ అనర్హత పిటిషన్‌లపై ఏపీ స్పీకర్ విచారణ..

Ap Speaker

Ap Speaker

అనర్హత పిటిషన్‌లపై ఇవాళ విచారణ జరగనుంది. నేడు వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్లను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని వ్యక్తిగతంగా విచారించనున్నారు. ఇక, ఎమ్మెల్సీలను శాసనమండలి ఛైర్మన్ విచారించనున్నారు. ఎమ్మెల్యేలకు స్పీకర్ ఎమ్మెల్సీలకు మండలి ఛైర్మన్ ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఇక, వైసీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ముందు ఇవాళ హాజరు కావడంపై ఉత్కంఠ నెలకొంది. నేడు ముగ్గురు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరుకాబోతున్నారు.

Read Also: Hanuman Flag: “హనుమాన్ జెండా”పై బీజేపీ వర్సెస్ కాంగ్రెస్.. కర్ణాటక వ్యాప్తంగా నిరసనలు..

అయితే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నాట్లు సమాచారం. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు స్పీకర్ ముందుకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరై, వివరణ ఇవ్వబోతున్నారు. అలాగే, వైసీపీ, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్లపై విచారణకు నేడు రావాలని స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు వెళ్లడంతో వారు ఇవాళ విచారణకు వెళ్లనున్నారు. నేటి మధ్యాహ్నం 2.45 గంటలకు హాజరుకావాలని పేర్కొనింది. ఇక, వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేల్లో ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు.. అయితే, టీడీపీ నుంచి మద్దాలి గిరి, వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేశ్‌లు ఉన్నారు.

Exit mobile version