Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Food Healthy Oats Omelette Recipe Telugu

Healthy Breakfast: మధుమేహం, అధిక బరువుకు చెక్.. నిమిషాల్లో తయారయ్యే ‘ఓట్స్ ఆమ్లెట్’ను ఇలా ట్రై చేయండి!

Published Date :February 17, 2026 , 8:54 pm
By Shiva Ganesh
Healthy Breakfast: మధుమేహం, అధిక బరువుకు చెక్.. నిమిషాల్లో తయారయ్యే ‘ఓట్స్ ఆమ్లెట్’ను ఇలా ట్రై చేయండి!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Healthy Breakfast: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయాన్నే పౌష్టికాహారం తీసుకోవడం ఎంతో అవసరం అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కేవలం రుచికే ప్రాధాన్యమివ్వకుండా, ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారం కోసం వెతికే వారికి ‘ఓట్స్‌ ఆమ్లెట్‌’ ఒక అద్భుతమైన ఎంపికగా చెబుతున్నారు. నిమిషాల్లో తయారయ్యే ఈ వంటకం బ్రేక్‌ఫాస్ట్‌గా మాత్రమే కాకుండా, స్నాక్‌ లేదా డిన్నర్‌గానూ కడుపు నింపుతుంది. సాధారణంగా ఆమ్లెట్‌ అంటే అందరికీ ఇష్టమే. దానికి ‘ఓట్స్‌’ తోడుగా చేరితే ఆ రుచే వేరుగా ఉంటుంది. ఫైబర్‌ పుష్కలంగా ఉండే ఓట్స్‌ను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడేలా ఓట్స్‌ ఆమ్లెట్‌‌ను ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Gautam Adani: AI రంగంలోకి అదానీ రాయల్ ఎంట్రీ.. లక్ష కోట్లు పెట్టుబడి పెట్టడానికి ప్లాన్!

కావలసిన పదార్థాలు:
ఓట్స్‌: అర కప్పు

ఉప్మా రవ్వ (బొంబాయి రవ్వ): 2 టేబుల్ స్పూన్లు

పెరుగు: 2 టేబుల్ స్పూన్లు

గుడ్లు: 3

తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, టమాటా ముక్కలు: తగినంత

మసాలాలు: ఉప్పు, కారం లేదా మిరియాల పొడి, పసుపు

తయారీ విధానం..
ముందుగా అర కప్పు ఓట్స్‌ను బాణలిలో వేసి 2-3 నిమిషాల పాటు తక్కువ మంటపై దోరగా వేయించాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఒక గిన్నెలో ఓట్స్‌ పొడి, బొంబాయి రవ్వ, పెరుగు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమం పిజ్జా పిండి మాదిరిగా చిక్కగా ఉండాలి. సిద్ధం చేసుకున్న మిశ్రమంలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, టమాటా ముక్కలతో పాటు తగినంత ఉప్పు, కారం, పసుపు వేయాలి. అనంతరం మూడు గుడ్లను కొట్టి వేసి బాగా కలపాలి. పొయ్యి మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె లేదా వెన్న రాసి, ఈ మిశ్రమాన్ని సమానంగా పరచాలి. పైన మూత పెట్టి తక్కువ మంటపై 3-4 నిమిషాల పాటు కాల్చాలి. ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత జాగ్రత్తగా రెండో వైపుకు తిప్పి మరో నిమిషం పాటు ఉంచాలి. ఎంతో సాఫ్ట్‌గా, స్పాంజీగా ఉండే ఈ ఓట్స్‌ ఆమ్లెట్‌ను వేడివేడిగా సర్వ్‌ చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. పైన కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్‌ లేదా టమాటా కెచప్‌తో అలంకరిస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

ఓట్స్‌ ఆమ్లెట్‌ ప్రయోజనాలు ఇవే..
* ఓట్స్‌ వల్ల శరీరానికి అవసరమైన పీచు పదార్థం అందుతుంది.

* గుడ్ల ద్వారా ప్రొటీన్‌ లభిస్తుంది.

* కూరగాయలు చేర్చడం వల్ల విటమిన్లు అందుతాయి.

* పిల్లల లంచ్ బాక్స్‌లకు ఇది ఒక పోషకమైన ఆహారం.

తక్కువ సమయంలో కమ్మని అల్పాహారం కావాలనుకునే గృహిణులకు, బ్యాచిలర్స్‌కు ఈ ‘ఓట్స్‌ ఆమ్లెట్‌’ సూపర్ ఛాయిస్‌గా చెబుతున్నారు. మరి ఆలస్యం ఎందుకు మీరు కూడా మీ ఇంట్లో కుదిరినప్పుడు ట్రై చేసి చూడండి.

READ ALSO: Gautam Adani: AI రంగంలోకి అదానీ రాయల్ ఎంట్రీ.. లక్ష కోట్లు పెట్టుబడి పెట్టడానికి ప్లాన్!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Breakfast recipes in Telugu
  • diabetes friendly breakfast
  • healthy breakfast ideas
  • Healthy Oats Recipes
  • How to make Oats Omelette

తాజావార్తలు

  • Air India Crisis: రూ.22 వేల కోట్ల నష్టంలో ఎయిర్ ఇండియా.. టాటా బాస్‌తో సింగపూర్ ఎయిర్‌లైన్స్ CEO రెస్క్యూ మీటింగ్!

  • HIGH COURT OF ANDHRA PRADESH: ఏపీ హైకోర్టులో 300 ఉద్యోగాలు.. రెండ్రోజులే ఛాన్స్.. త్వరగా అప్లై చేసుకోండి

  • Rahul Gandhi: రాహుల్ గాంధీకు బిగ్ షాక్.. ద్వంద్వ పౌరసత్వం కేసులో ఎఫ్ఐఆర్..

  • UPI Transactions: యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తే గంట ఆగాల్సిందే.. ఆర్బీఐ కీలక ప్రకటన..

  • Rahul Gandhi: ప్రధానికి, నాకు “భార్యల” సమస్య లేదు.. లోక్‌సభలో రాహుల్ గాంధీ..

ట్రెండింగ్‌

  • Health Tips : వర్కౌట్ బట్టల్లో ప్రాణాంతక రసాయనాలు.. ఫిట్‌నెస్ కోసం వెళ్తే అనారోగ్యం ఫ్రీ.!

  • Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్‌కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!

  • How to choose Good Mango: రంగు కాదు.. రుచి ముఖ్యం.! పర్ఫెక్ట్ ‘మామిడి పండు’ని ఇలా సెలెక్ట్ చేసుకోండి..

  • 8000mAh భారీ బ్యాటరీ, డ్యూయల్ 200MP కెమెరాలతో రాబోతున్న కొత్త ఫ్లాగ్‌షిప్ Oppo Find X10 సిరీస్..!

  • T20 World Cup 2026 Fixing: 2026 టీ20 ప్రపంచ కప్‌లో ఫిక్సింగ్.. ఐసీసీ దర్యాప్తు షురూ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions