Site icon NTV Telugu

Health Tips : మీ గుండె ఆరోగ్యం కోసం వీటిని తప్పక తీసుకోవాలి..

Superfoods For A Healthy Heart

Superfoods For A Healthy Heart

మన శరీరంలో గుండె చాలా ముఖ్యమైంది.. శరీరంలో ఏదైనా సమస్య వస్తే అది గుండెకు ఎఫెక్ట్ అవుతుంది.. అందుకే గుండె ఆరోగ్యం కోసం కొన్ని ఆహార నియమాలను పాటించాలి.. ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. జంక్ ఫుడ్స్, కొవ్వు ఎక్కువగా కలిగిన ఆహారం ఎక్కువ తీసుకోవడం వల్ల గుండె సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.. అయితే గుండె ఆరోగ్యం కోసం ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లో తాజా ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు మనకు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరం లో కొలెస్ట్రాల్ ను కరిగించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే ధాన్యాలను తీసుకోవడం వల్ల కూడా గుండె పరితీరు మెరుగుపడుతుంది.. జీర్ణ వ్యవస్థ పనితీరును పెంచుతుంది.. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.. డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయి..

ఫైబర్, విటమిన్స్ వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి. వీటిలో క్యాలరీలు కూడా అధికంగా ఉండవు. సలాడ్స్ లో, స్నాక్స్ గా వీటిని తీసుకోవచ్చు. అలాగే బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, స్ట్రాబెర్రీ, రాస్ బెర్రీ వంటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.. ఇవి కొవ్వును తగ్గించి అధిక బరువును తగ్గించడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.. ఇకపోతే వీటిని రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చిక్కుళ్లు, బీన్స్, రాజ్మా వంటి వాటిని తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లో కూడా ఇవి ఎంతగానో సహాయపడతాయి.. వీటిని రోజూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం పదిలం.. అన్నిటికన్నా ముందు టైం కు తినడం అలవాటు చేసుకోవాలి.. ఇది మర్చిపోకండి..

Exit mobile version