మన శరీరంలో ప్రతి విటమిన్స్ కరెక్ట్ ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటారు..ఐరన్ అనేది చాలా అవసరం.. హేమోగ్లోబిన్ తయారీకి ఐరన్ చాలా అవసరం. హిమోగ్లోబిన్ శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను అందించడానికి తోడ్పడుతుంది. మన శరీరంలో ఇతర హార్మోన్ల తయారీకి ఐరన్ అవసరం. ఇనుము లోపం కారణంగా మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కోల్పోయి వివిధ వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఎక్కువవుతుంది..స్ట్రెస్, యాంగ్జైటీ ఎక్కువవుతాయి. యాంగ్జైటీ, ప్యానిక్ ఎటాక్స్, డిప్రెషన్, మతిమరుపు లాంటివన్నీ ఐరన్ లోపం లక్షణాలు. గుండె వేగం పెరగటం, చేతులు చల్లబడటం, తలనొప్పి, జీర్ణ సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఐరన్ లోపం వల్ల ఆలోచనల సామర్థ్యం, జ్ఞాపకశక్తి కూడా తగ్గే అవకాశం ఉంది. కొన్ని ఐరన్ రిచ్ డ్రింక్స్ తాగితే..ఐరన్ త్వరగా పెరుగుతుంది..ఐరన్ త్వరగా పెరిగే కొన్ని జ్యూస్ ల గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం..
బీట్‌రూట్‌లో ఫోలేట్, మాంగనీస్, పొటాషియం, ఐరన్, బీటైన్, విటమిన్ సితో సహా అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బీట్‌రూట్ జ్యూస్ లివర్ నుంచి విషాన్ని, వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. బీట్‌రూట్ జ్యూస్ ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్‌ను తీసుకోవడం మెరుగుపరుస్తుంది. బీట్‌రూట్ జ్యూస్‌ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు త్వరగా పెరుగుతాయి.. దాంతో చర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది..
గుమ్మడికాయలో ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఐరన్ లోపంతో బాధపడేవారికి గుమ్మడికాయ జ్యూస్ ఎంతో సహాయపడుతుంది. గుమ్మడికాయలో పాస్ఫరస్,ఐరన్, మెగ్నీషియం, క్యాల్షియం, ఐరన్, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడికాయలో యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అనిమియాతో బాధపడేవారు ఈ జ్యూస్ ను ఒక్కసారి తాగితే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో..
పుదీనా ఆకులలో 15.6 మి.గ్రా ఐరన్ ఉంటుంది. ప్రతిరోజూ 1 కప్పు తాజా పుదీనా జ్యూస్ తాగితే.. ఐరన్ లభిస్తుంది.. పుదీనా ఫ్లేవర్ తగ్గాలంటే కొద్దిగా బెల్లం వేసుకొని కూడా తాగొచ్చు.. బెల్లంలో కూడా ఐరన్ ఉంటుంది.. క్యారెట్ కూడా మంచిదే.. తాజాగా కూరగాయలు, పండ్లు కూడా మంచివే..
