NTV Telugu Site icon

Health Tips : వీటిని రోజు తింటే యవ్వనంగా, మరింత అందంగా కనిపిస్తారు..!

Healthy Food

Healthy Food

మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణం కాలుష్యం అవ్వడం వల్ల చాలా మంది తక్కువ వయస్సులోనే ముసలివాళ్లుగా కనిపిస్తారు.. యవ్వనంగా, మరింత అందంగా కనిపించాలంటే కొన్ని ఆహారపదార్థాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, రక్షించడంలో ఆహారాల పాత్ర ఎనలేనిది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూరగాయలు కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే కూరగాయలు మన చర్మాన్ని రక్షిస్తాయి. యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. ఇందుకోసం ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

* . ఆకుకూరలు మన శరీరానికి చాలా మంచివి.. పాలకూర జ్యూస్ లో విటమిన్ ఎ, విటమిన్ సి తో పాటుగా ఇతర సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ జుట్టును, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే చర్మం అందంగా మెరవడానికి సహాయపడతాయి. దీనిలో ఉండే విటమిన్ సి చర్మ నష్టం, వృద్ధాప్యం, మంట నుంచి చర్మాన్ని రక్షిస్తాయి
*. క్యారెట్లలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. బీటా కెరోటిన్లు క్యారెట్లకు నారింజ రంగును ఇస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల చర్మానికి మెరిసే లక్షణాలు లభిస్తాయని, చర్మ ఛాయ మెరుగుపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి..
*. కీరదోసకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే కణాల పునరుత్పత్తి ప్రక్రియకు ఇది సహాయపడుతుంది. కీరదోసకాయలు చర్మానికి రంగును ఇచ్చే మెలనిన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. అలాగే అధిక ఉత్పత్తిని నిరోధిస్తుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. విటమిన్ ఎ, విటమిన్ సి వంటి ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న కీరదోసకాయ మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో సహాయపడతాయి.
*. చిలగడదుంపలలో విటమిన్ ఎ, విటమిన్ సి కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మంలో కొల్లాజెన్ ఏర్పడటానికి సహాయపడుతుంది. ఇది చిన్నా, పెద్దా చర్మ సమస్యలను నయం చేస్తుంది. దీనిలో ఉండే ఉండే విటమిన్ ఇ మీ ముఖం సహజంగా అందంగా ఉంటారు..
*.బీట్ రూట్.. హైపర్పిగ్మెంటేషన్ తో సహా చర్మ సమస్యలకు చికిత్స చేయడానికి బీట్రూట్ ఎంతో సహాయపడుతుంది. బీట్ రూట్లు సహజ యాంటీఆక్సిడెంట్ కావడంతో ఇవి చర్మం పొడిబారడం, అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తాయి.. చర్మం మరింత అందంగా యవ్వనంగా కనిపిస్తారని నిపుణులు చెబుతున్నారు.. ఇక ముఖ్యంగా నీళ్లను ఎక్కువగా తీసుకోవడం మంచిది..