NTV Telugu Site icon

Health Tips : అంజీరాలను ఇలా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో.. అస్సలు నమ్మలేరు..

Anjeeraa

Anjeeraa

డ్రై ప్రూట్స్ లలో ఒకటి అంజీరా.. ఈ పండులో ఎన్నో పోషకాలు ఉన్నాయి..చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అంజీరాలను పండ్ల రూపంలో తీసుకున్నా లేదాడ్రై ఫ్రూట్స్ రూపంలో తీసుకున్నా కూడా మనకు మేలు కలుగుతుంది.. ఎన్నో రకాల రోగాలను నయం చేస్తుంది.. అయితే వీటిని పాలల్లో నానబెట్టి ఉదయం తీసుకోవడం వల్ల చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

విటమిన్ ఎ, బి6, సి, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. అంజీరాలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.. ఉదర, జీర్ణ సమస్యలు కూడా తగ్గిపోతాయి.. అంతేకాదు పెద్ద ప్రేగు క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు మన దరి చేరుకుండా ఉంటాయి. రక్తహీనతతో బాధపడే వారు అంజీరాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.. ఇంకా వీటిని డైట్ లో చేర్చుకోవచ్చు..

సులువుగా బరువు తగ్గుతారు… ఎక్కువగా తీసుకుంటే అంతే సులువుగా బరువు కూడా పెరుగుతారు.. అందుకే లిమిట్ గా తీసుకోవడం చాలా మంచిది.. ఎముకలు ధృడంగా, బలంగా తయారవుతాయి. అంతేకాకుండా అంజీరాలను తీసుకోవడం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. రోజూ 2 లేదా 3 అంజీరాలను పాల్లలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ అంజీరాలను తిని పాలను తాగాలి. ఇలా చేయడం వల్ల పురుషుల్లో లైంగిక సమస్యలు తగ్గి లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.. పిల్లలకు ఎదుగుదలకు ఇది సహాయ పడుతుంది.. చర్మం, జుట్టు సమస్యలను కూడా తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.