Site icon NTV Telugu

Health Tips : చలికాలంలో బరువు పెరుగుతున్నారా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

Weight Gain

Weight Gain

చలికాలంలో ఎన్నో వ్యాధులు రావడం మాత్రమే కాదు.. బరువు కూడా పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు.. చలికాలంలో శరీరం సహజంగా అధిక క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్నటువంటి ఆహారాలను కోరుకుంటుంది.. దాంతో పాటుగా ఎండ తీవ్రత కూడా తక్కువగా ఉండడం వలన మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ఈ సీజన్ సీజనల్ ఎఫెక్టివ్ డిసార్డర్ అనే పరిస్థితికి దారితీస్తుంది.. అందుకే ఎక్కువగా మనం అలాంటి ఫుడ్ కోసం వెతుకుతాము.. అధిక క్యాలరీలు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు కూడా పెరిగిపోతారు.. బరువును కంట్రోల్ చేసే కొన్ని టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

వాకింగ్ లేదా జాగింగ్ లాంటి వ్యాయామాలు చేయాలి. ఈ చర్యలు జీవితంలో భాగమై ఉండాలి. యోగ చేయాలనుకుంటే బయటకు వెళ్ళడానికి వీలు లేకపోతే.. ఇంట్లోనే ఉండి యోగ వంటివి చేస్తుండాలి.. తినే సమయంలో తిండి పై దృష్టి పెట్టడం చాలా మంచిదని చెబుతున్నారు వైద్యులు. మొబైల్ ఫోన్స్ , టీవీ చూస్తూ తినడం వలన ఎక్కువగా తినడానికి ఆస్కారం ఉంటుంది. అందువలన తినే సమయంలో ఆహారం విషయంలో శ్రద్ధ వహించాలి.. అందులోనూ షుగర్ , కొవ్వు ఎక్కువ మోతాదు కలిగిన పదార్థాలు, డీప్ ఫ్రై వంటి ఆహారాలను పక్కకు పెట్టి.. తాజా కూరగాయలు, పండ్లు, తక్కువ కొలెస్ట్రాల్ కలిగి నటువంటి పదార్థాలను తీసుకోవడం ఉత్తమం.. కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది..

నీళ్లను ఎక్కువగా తాగాలి..చల్లని వాతావరణంలో హైడ్రేటెడ్ గా ఉండటానికి హెర్బల్ టీ లేదా వెచ్చని నిమ్మకాయ నీరు వంటి వెచ్చని పానీయాలను ఎంచుకోండి. సరైన ఆర్ద్రీకరణ జీర్ణక్రియలో సహాయపడుతుంది.. ప్రశాంతంగా నిద్ర పోవాలి.. రాత్రి 9 గంటల ప్రాంతంలో పడుకునే విధంగా టైమును కేటాయించుకోవాలి. ఆ సమయంలో పడుకుంటే తగినంత నిద్రతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి ఉంటుంది.. ఒత్తిడి లేకుండా ఉంటే బరువు కూడా పెరగరని నిపుణులు చెబుతున్నారు.. సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version