NTV Telugu Site icon

Health Tips : ఈ చిట్కాలు పాటిస్తే ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉంటారు

Health Tips

Health Tips

Health Tips for Immunity booster

నేటి అత్యాధునిక సమాజంలో ఉరుకుల పరుగుల జీవితం గడుపుతున్నాం. రోజుకో వైరస్‌ పుట్టుకొచ్చి ప్రజలపై విరుచుకుపడుతోంది. రోగం వచ్చిదంటే.. ఆసుపత్రుల చుట్టు తిరిగేకంటే.. రాకముందే ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఎంతో మంచిది. మన పూర్వీకుల పొందుపరిచిన గ్రంధాల్లో ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మనం చూద్దాం..

1నేతిలో వేయించిన వెల్లుల్లిపాయలు ఆహారంలో ప్రతిదినం మేము పూర్వకంగా తింటే జీవక్రియ ఆయుర్దాయం పెరుగుతుంది.

2. ప్రతి రోజు వాము రసం తీసుకుంటే గుండె నొప్పి ఉండదు. రోజుకు రెండు ఆకుల చొప్పున సరస్వతి ఆకులు తింటూ ఉంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

3. దానిమ్మ పండు రసం తీసుకుంటే రక్త వృద్ధి శుద్ధి అవుతుంది. పెద్ద ఉసిరికాయలు ఎండబెట్టి, వరుగులు గా అయిన తర్వాత పట్టు తేనె లో నానబెట్టి ఆరు మాసములు ఊరిన తర్వాత రోజు ఒకటి తింటే రక్తపోటు, హృదయ కోసం వ్యాధులు దరిచేరవు. ఎంతటి వారికైనా మంచి చురుకుదనం వస్తుంది.

4. బొల్లి నివారణకు ముల్లంగి గింజలను, ఉత్తరేణి ఆకు రసముతో నూరి, చర్మముపై రాయుచున్న బొల్లి మచ్చలు నివారణ అగును. మునగాకు రసం మునగాకు తో వండిన వంటకాలు తింటే రోగాలు రావు. ప్రతిదినం తేనే, అల్లం రసం కలిపి తాగితే రక్త శుద్ధి, మెదడుకు సంబంధించిన వ్యాధులకు నివారణ జరుగుతుంది.

5. తులసి ఆకు పసరు తేనే కలిపి తాగితే సర్వ తొలగిపోతాయి. దెబ్బలకు పైనుండి పడుట వలన కలిగిన నొప్పులు తగ్గాలంటే శిలాజిత్తు పాలతో కలిపి తీసుకోవాలి. గుంటకన్నాకు మిరియాలు నూరినా మాత్రం తాగితే వాతావరణ మార్పుల వచ్చే జ్వరాలు తగ్గుతాయి. ఆకుకూరలు, అరటిపళ్ళు, బంగాళదుంపలు, తులసి ఆకుల వల్ల బీపీ తగ్గుతుంది.

6. రాత్రి పడుకోవడానికి ముందు చిమ్మిలి తింటే మలబద్ధకం హరిస్తుంది. అల్లం రసం తాగితే జీర్ణం, మలబద్ధకం తగ్గుతాయి. వాటి వల్ల వచ్చే తలపోటు తగ్గుతుంది. అన్నం మొదటి ముద్ద వాము వేయించి నేతితో తింటే ఆకలి పుడుతుంది, అజీర్ణం పోతుంది.

7. గోరుచుట్టు పచ్చి పసుపు దుంప మెత్తగా నూరి వేళ్ళపై చూసి మధ్యమధ్యలో తడుపుతూ ఉంటే తగ్గుపోతుంది. అరటి దూట రసం సర్వరోగ నివారిణి. మెంతులు, మెంతి కూర ఎక్కువ వాడిన చక్కెర వ్యాధి తగ్గును. తెలగపిండి ఆకు రసం రోజు ఒక తులం సేవిస్తే మూత్రపిండాలలో రాళ్లు కరిగిపోతాయి.

8. వేడి నీటిలో తేనె కలిపి తాగుతుంటే స్థూలకాయం తగ్గుతుంది. కుంకుడుకాయ రసం చేసి రెండు ముక్కలు లోను వేస్తే పార్శ్వ నొప్పి పోతుంది. ఇలా చేస్తే చాలు. మనం నిత్యం యవ్వనంగా ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండొచ్చు.

 

Show comments