Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Lifestyle Health Tips Drink Garlic Like This Daily See What Happens

Health Tips: రోజూ వెల్లుల్లిని ఇలా చేసుకొని తాగండి.. ఏమౌతుందో మీరే చూడండి..

Published Date :July 9, 2023 , 10:10 am
By Swathi Maddula
Health Tips: రోజూ వెల్లుల్లిని ఇలా చేసుకొని తాగండి.. ఏమౌతుందో మీరే చూడండి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

వెల్లుల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..అయితే వెల్లుల్లిని వాడడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని మనందరికి తెలిసిందే. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. చాలా మంది వెల్లుల్లిని నేరుగా తింటూ ఉంటారు. కొందరు తేనెతో కలిపి తీసుకుంటూ ఉంటారు. వీటితో పాటు వెల్లుల్లి నీటిని తాగడం వల్ల కూడా మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.. వెల్లుల్లి నీటిని ఎలా చేసుకోవాలి.. ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని వాటిపై ఉండే పొట్టును తీసి వేయాలి. తరువాత ఈ వెల్లుల్లి రెబ్బలను నలగొట్టి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత ఈ వెల్లుల్లి రెబ్బలను ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో వేసి కలిపి తాగాలి. ఈ నీటిని రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది..శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయాల్, యాంటీ ఫంగల్ వంటి గుణాలు అధికంగా ఉంటాయి. వెల్లుల్లి నీటిని తీసుకోవడం వల్ల మనం వైరస్, బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. వర్షాకాలంలో ఈ నీటిని మనం తప్పకుండా తీసుకోవాలి. ఈ నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి వాతావరణ మార్పుల కారణంగా తలెత్తే ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము..

షుగర్ ను అదుపులో ఉంచుతుంది..బరువు తగ్గాలనుకునే వారు ఈ వెల్లుల్లి నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. అదే విధంగా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వారు, గుండె జబ్బులతో బాధపడే వారు ఈ వెల్లుల్లి నీటిని తాగడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది.. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది..మూత్రంలో ఇన్ఫెక్షన్స్ ను తగ్గించడంలో ఈ నీరు చక్కగా పని చేస్తుంది. అదే విధంగా కీళ్ల నొప్పులు, వాపులతో బాధపడే వారు వెల్లుల్లి నీటిని తీసుకోవడం వల్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.. ఇంకా ఈ వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • amazing benefit
  • garlic water
  • health benefits
  • reduce cholesterol

తాజావార్తలు

  • Gopichand33: మ్యాచో స్టార్ గోపీచంద్ 33వ సినిమా అప్‌డేట్..

  • PM Modi: ఏకమవ్వాలి.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరుతూ ఎంపీలకు ప్రధాని మోడీ లేఖ

  • Asha Bhosle : మూగబోయిన గాన గంధర్వం.. లెజెండరీ గాయని ఆశా భోస్లే కన్నుమూత

  • SBI ATM: ఎస్‌బీఐ ఏటీఎంలలో భారీగా నగదు గల్లంతు.. ఏకంగా రూ.కోటి 20 లక్షలు

  • NTRNeel : విలన్‌గా బాలీవుడ్ స్టార్.. కానీ లుక్ మాత్రం..?

ట్రెండింగ్‌

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions