NTV Telugu Site icon

Health Tips : రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ విషయాల గురించి తెలుసుకోవాల్సిందే..

Coffi

Coffi

పొద్దున్నే లేవగానే చాలా మందికి టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది.. అలా తాగితేనే చాలామందికి ఆనందంగా ఉంటారు.. చాలా మంది ఉదయమే కాకుండా బద్ధకంగా అనిపించి నప్పుడు, తలనొప్పి వచ్చినప్పుడు, పని ఒత్తిడిలో ఉన్నప్పుడు కాఫీ పడితే ఆ కిక్కే వేరప్పా.. కెఫీన్ ఎక్కువైతే నిద్ర తగ్గటం,శరీరం డీహైడ్రేషన్ బారిన పడటం వంటి సమస్యలు వస్తాయి. అయితే మితంగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కాఫీలో కొన్ని రకాల యాంటీఆక్సిడెంట్స్ ఉండుట వలన కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.. కాఫీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

కాఫీ మూడ్, మెమరీ, అలర్ట్నెస్ మరియు రియాక్షన్ టైమ్ వంటి విషయాల్లో చురుకుగా ఉంటుంది. అందువల్లే పనిచేసే వారు సహజంగా కాఫీని ఎక్కువగా త్రాగుతూ ఉంటారు. ఒక కప్పు త్రాగితే జీర్ణ క్రియలు బాగా జరిగి తక్షణ శక్తిని అందిస్తుంది. అలసటను తగ్గిస్తుంది. కాఫీలో ఉండే కెఫీన్ రక్తంలో కలిసినప్పుడు వెంటనే మెదడుకు చేరి మెదడు చురుకుగా పనిచేస్తుంది. దాంతో అలసట తగ్గుతుంది.. ఇక కాఫీ బరువు తగ్గించటంలో కూడా సహాయపడుతుంది. కాఫీని ఒక బర్నింగ్ ఏజెంట్ గా చెప్పవచ్చు. శరీరంలో కెఫీన్ వేడి పుట్టించి జీవక్రియలను వేగవంతం చేసి కొవ్వును విచ్ఛిన్నం చేసి కొవ్వు కరగటానికి సహాయపడుతుంది.. త్వరగా తగ్గాలని అనుకొనేవారు.. దూరంగా ఉండటమే బెస్ట్..

కాఫీలో ఉండే కెఫీన్ బ్లాక్ అయిన నరాలను తెరచుకొనేలా చేసి నరాలను ఉత్తేజ పరుస్తుంది. కాఫీని మితంగా తీసుకుంటే కాలేయానికి రక్షణ కలిగిస్తుంది. డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఒక కప్పు కాఫీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది… ఇంకా మధుమేహం ఉన్నవారు రెగ్యులర్ గా అంటే సరైన మోతాదులో కాఫీ త్రాగితే రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.కాఫీలో పొటాషియం, మెగ్నీషియం, పాంథోనిక్ యాసి, నియాసిన్, మెగ్నీషియం, మరియు రిబోఫ్లివిన్, వంటివి కాఫీలో ఉంటాయి.. వీటివల్ల శరీరం రోగాల బారిన పడకుండా ఉంటుంది.. ఏదైనా లిమిట్ గానే తీసుకోవాలి.. రోజుకు ఒకటి లేదా రెండు కప్పులు అంతే..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Show comments