Site icon NTV Telugu

Health Tips : పచ్చి టమోటాలను ఎక్కువగా తింటున్నారా? ఏమౌతుందో తెలుసా?

Green

Green

టమోటాను చూడగానే చాలా మందికి తినాలని అనిపిస్తుంది.. ఇక టమోటాలను తీసుకోవడం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలుసు.. పండు టమోటాలను మాత్రమే కాదు పచ్చి టమోటాలను తీసుకున్నా మంచి ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. పచ్చి టమాటాను ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం…

వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సితోపాటు కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. టమోటాలలో ఫైటోకెమికల్స్‌ అధికంగా ఉంటాయి. గ్రీన్ టమాటాలో క్యాల్షియం, పొటాషియం, విటమిన్ సి, విటమిన్‌ ఎ అలాగే ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. ఇందులో ఉండే క్యాల్షియం ఎముకలను దృడంగా ఉండేలా చేస్తుంది.. దంతాలను కూడా దృడంగా ఉండేలా చేస్తుంది..

బీటా కెరాటిన్ పుష్కలంగా ఉంటుంది. దీంతో కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కంటి సంబంధిత సమస్యలతో బాధపడేవారు రోజుకు ఒక పచ్చి టమాటో తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందుతారు.. అంతేకాదు వీటిని రెగ్యులర్ తీసుకోవడం వల్ల చలికాలంలో చర్మం పగలకుండా మృధువుగా అందంగా మారుస్తుంది…యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. అంతేకాదు క్యాన్సర్ సంబంధిత కణాల పెరుగుదలను నిరోధించడంలో కూడా పచ్చి ఉపయోగపడుతుంది.. కళ్ల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.. వృద్ధాప్య ప్రభావం తగ్గి ఎప్పుడూ అందంగా, కాంతివంతంగా కనబడతారు. ఆకుపచ్చ టమోటాలలో విటమిన్ సి అధిక మొత్తంలో ఉండడం వల్ల చర్మం ముడతలు పూర్తిగా తగ్గిపోయి అందంగా తయారవుతారు.. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version