Site icon NTV Telugu

Health Tips: ఈ 5 నాచురల్ ఫుడ్‌తో ప్రోటీన్ సమస్య ఇట్టే దూరం.. కరీనా కపూర్ కూడా ఇదే ఫాలో అవుతారు!

Health Tips Protein

Health Tips Protein

ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి ఆహారంలో ‘ప్రోటీన్’ చాలా ముఖ్యం. కండరాల నిర్మాణం, ఎముకల పటిష్టం, హార్మోన్లు-ఎంజైమ్‌ల ఉత్పత్తి, జీవక్రియను మెరుగుపరచడానికి ప్రోటీన్స్ సహాయపడుతుంది. బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తిన్నప్పుడు శరీరం బాగుంటుంది. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల మన బాడీ తరచుగా అనారోగ్యంకు గురవుతుంది. అయితే బాలీవుడ్ నటి కరీనా కపూర్ డైటీషియన్‌, పోషకాహార నిపుణురాలు రుజుత దివేకర్ రోజువారీ ఆహారం ద్వారా ప్రోటీన్ లోపాన్ని ఎలా నివారించాలో వివరించారు. ఈ ఐదు సహజ వనరులను ఆహారంలో చేర్చడం ద్వారా ప్రోటీన్ లోపాన్ని ఇట్టే దూరం చేయొచ్చని చెప్పారు.

రోటీ, రైస్:
మనం తరచుగా మొలకలపై దృష్టి పెడతాము కానీ.. రోటీ, రైస్ వంటి కార్బోహైడ్రేట్ ఆహారాలకు దూరంగా ఉంటాము. ఇలా చేయడం వల్ల శరీరానికి అవసరమైన అన్ని అమైనో ఆమ్లాలు అందవు. దీనివల్ల శరీరంలో ప్రోటీన్ లోపం ఏర్పడుతుంది. అందువల్ల మొలకలతో పాటు రోటీ, బియ్యం వంటి కార్బోహైడ్రేట్ ఆహారాలను కూడా రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.

పప్పు:
పప్పు లేకుండా భారతీయ ఆహారం అసంపూర్ణంగా ఉంటుంది. కానీ అప్పుడప్పుడు కూర రూపంలో తినడం కంటే.. దానిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. పప్పులో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన శరీరానికి చాలా ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.

Also Read: Amazon Sale 2025: ఇది కదా డీల్ అంటే.. షావోమీ 14 సీవీపై 17 వేల తగ్గింపు!

డ్రై ఫ్రూట్స్:
బాదం, వాల్‌నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్‌తో పాటు మీరు మీ ఆహారంలో చిక్‌పీస్, వేరుశెనగలను కూడా చేర్చుకోవాలి. వీటిని సాయంత్రం స్నాక్‌గా తినవచ్చు. మీ ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా మీ శరీరంలో ప్రోటీన్ లోపాన్ని అధిగమించవచ్చు.

పాలు, పాల ఉత్పత్తులు:
పాలు, పాల ఉత్పత్తులలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. పాలు లేదా ఏదైనా పాలతో చేసిన పదార్థాలను రోజుకు కనీసం ఒక్కసారైనా తీసుకోవాలి. ఉదయం పాలు తాగినా లేదా మధ్యాహ్నం పెరుగు అన్నం తిన్నా.. పాల పదార్థాలను మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం మర్చిపోవద్దు.

మాంసం, చేపలు, గుడ్లు:
మీరు నాన్-వెజ్ తినేవారైతే.. ఆహారంలో మాంసం, చేపలు, గుడ్లను చేర్చుకోవచ్చు. ఇవి శరీరానికి అవసరమైన ప్రోటీన్‌ను అందించడమే కాకుండా కండరాలను నిర్మించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

 

 

Exit mobile version