NTV Telugu Site icon

Covid Alert: పెరుగుతున్న కరోనా కేసులు.. అప్రమత్తంగా ఉండాలి

Raja Narasimha

Raja Narasimha

పొరుగు రాష్ట్రాల్లో కొవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సూచన మేరకు వైద్య శాఖ అప్రమత్తంగా, అన్నిరకాలుగా సంసిద్ధంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ఈ నెల 8న కొవిడ్ కొత్త వేరియంట్ జేఎన్.1 వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Read Also: Kerala: అమానవీయ ఘటన.. వృద్ధురాలైన అత్తను దారుణంగా కొట్టిన కోడలు, వీడియో వైరల్

రాబోయే పండుగల సీజన్‌ దృష్ట్యా.. ప్రజలంతా శ్వాసకోశ పరిశుభ్రతను పాటించాలి, అవసరమైన మేరకు మాస్కులను ధరించాలని సూచించారు. అవసరమైన ప్రజారోగ్య చర్యలు, ఇతర ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉందని, తగినన్ని వ్యాధినిర్ధారణ పరీక్షలకు కావాల్సిన కిట్స్, చికిత్సకు అవసరమైన మందులు ఆక్సిజన్ అందుబాటులో ఉన్నాయని వివరించారు. పౌరులు ఆందోళన చెందవద్దని, చలికాలం నేపథ్యంలో శ్వాసకోశ సంభందించిన వ్యాధులు పెరిగే విషయాన్ని గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Read Also: Cheating: ఆయుర్వేదిక్ డెవలపర్ పేరిట కుచ్చు టోపీ.. కోట్లలో మోసపోయిన బాధితులు

Show comments