NTV Telugu Site icon

Milk: ఆరోగ్యానికి మంచిదని పాలు ఎక్కవగా తాగుతున్నారా? వెంటనే ఆపేయండి.

Milk

Milk

Milk Over Consumption: పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. చిన్న పిల్లలు త్వరగా పెరగడానికి పాలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. రోజుకు ఒక కప్పు పాలు తాగితే ఆరోగ్యానిక చాలా మంచిది.  పాలలో పాలలో ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పొటాషియం, కాల్షియం, పొటాషియం, మెగ్నీషయం, విటమిన్‌ డి, బి 12 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఎముకల బలంగా ఉండటానికి కాల్షియం ఉపయోగపడుతుంది. అందుకే వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యంగా ఎముకలు బలంగా ఉండటానికి పాలు తాగాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. అంతేకాకుండా  రాత్రిపూట పాలు తాగితే ప్రశాంతంగా నిద్రకూడా పడుతుంది. అయితే రోజుకు మూడు కప్పుల వరకు పాలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అంతకు మించి తీసుకుంటే శరీరానికి కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంది. అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. అంటే ఏ విషయంలో అయినా అతి పనికి రాదు. అతిగా తీసుకుంటే ఎంత మంచి చేసేదైనా అనర్థంగానే మారుతుంది. పాలు తాగే విషయంలో కూడా అదే వర్తిస్తుంది. పాలు ఎక్కువగా తీసుకుంటే వాతం చేస్తుంది. పేగుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. పాలలో ఉండే ఎ1 కేసైన్ కారణంగా ఇలా జరుగుతుంది. పాలు ఎక్కువగా తీసుకుంటే పేగులపై పొరలా ఏర్పడి జీవప్రక్రియ ఆలస్యమవుతుంది. అంతేకాకుండా కడుపులో మంటగా కూడా అనిపిస్తుంది. ఇది ప్రేగుల అల్సర్ కు దారి తీయవచ్చు.

Also Read: Jabardasth Shanthi: సర్జరీ కోసం ఇల్లు అమ్మేస్తున్న జబర్దస్త్ నటుడు..

పాలు అధికమొత్తంలో తాగేవారిలో కడుపు ఊబ్బరం, తిమ్మిరి, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. పాల వల్ల ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా  సమస్యలు వస్తాయి. వాటిలో ప్రధానంగా చర్మ సమస్యలు కూడా కలగవచ్చు. చర్మానికి ఎంతో వన్నె తెచ్చే పాలు చర్మ సమస్యలకు ఎలా కారణమవుతాయి అనుకుంటున్నారా? అవును నిజంగానే పాలు ఎక్కువగా తీసుకుంటే చర్మంపై ఎర్రటి దద్దురులు, పగుళ్లు ఏర్పడతాయి. అంతేకాకుండా ఎలర్జీ, మెటిమలు కూడా పాలు అధికంగా తాగితే రావచ్చు. అయితే మనం పాలు తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం స్వచ్ఛమైన పాలనే తాగాలి. ప్రస్తుతం అన్నీ కల్తీ అవుతున్నాయి. పాలలో కూడా యూరియా కలిపి కల్తీ చేస్తున్నట్లు అనేక కథనాలు వస్తున్నాయి. అందుకే పాలు తాగేటప్పుడు ఎటువంటి రసాయనాలు లేని ఆరోగ్యకరమైన పాలనే తాగాలి.