NTV Telugu Site icon

Health Tips : మగవాళ్ళు“బొప్పాయి” పండు అస్సలు తినకూడదు.. ఎందుకో తెలుసా..?

Boppaya

Boppaya

బొప్పాయి పండు తింటే మనకు ఎలాంటి ఆరోగ్యకరం ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. దీనివల్ల పలు అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. శరీరంలో ఉన్న విష పదార్ధాలు బయటకి వెళ్ళిపోతాయి. యాంటీ బాక్టీరియా, యాంటీఫంగల్‌ గుణాలు ఉండటం వల్ల ఇన్ఫెక్షన్‌ల నుంచి రక్షణ లభిస్తుంది. ఇక డెంగ్యూ వచ్చిన వారు ప్లేట్‌లేట్స్‌ కోల్పోతూ ఉంటే బొప్పాయి పండు ద్వారా వాటిని కంట్రోల్‌ చేయవచ్చు. రక్తం కూడా పెరుగుతుంది. అయితే బొప్పాయి పండ్లు తినేవారు మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. లేదంటే పండు తినడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు. గర్భిణీలు బొప్పాయి పండును ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. ఎందుకంటే ఇందులో ఉండే పలు రసాయనాలు నేరుగా గర్భాశయం పై ప్రభావం చూపుతాయి. దీంతో అబార్షన్‌ జరిగేందుకు అవకాశం ఉంటుంది. కనుక బొప్పాయి పండును గర్భిణీలు తినరాదు. ఇక రెండవది అన్నవాహిక.. మనం తిన్న ఆహారం నోటి నుంచి జీర్ణాశయానికి అన్నవాహిక చేరవేస్తుంది. అయితే బొప్పాయి పండు వల్ల కొందరిలో అన్నవాహిక దెబ్బ తినవచ్చు. అంతే కాకుండా పండును బాగా తింటే ఎవరికైనా అన్నవాహికపై ప్రభావం చూపుతుంది. కనుక ఎప్పుడు ఈ పండుని తిన్న ఒక కప్పుకు మించి తినరాదు.

ఇక మూడవది పుట్టుక లోపాలు. గర్భిణి లే కాదు పాలిచ్చే తల్లులు కూడా బొప్పాయి పండ్లు తినరాదు. తింటే వారు ఇచ్చే పాలతో పలు రసాయనాలు బిడ్డ శరీరంలోకి వెళ్తాయి. దీంతో అవి శిశువులకు లోపాలు కలిగిస్తాయి. అనంతరం అవి అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. కనుక పాలిచ్చే తల్లులు కూడా బొప్పాయి పండ్లు తినరాదు. బొప్పాయి పండు కొందరికి పడదు. అలర్జీని కలిగిస్తుంది. కనుక ఎవరు పండును తిన్నా ముందుగా ఒక చిన్న ముక్క తిని పర్వాలేదు అనుకుంటేనే తినడం ఉత్తమం. ఇక బీపీ సమస్యతో బాధపడేవారు బీపీ టాబ్లెట్‌లు వేసుకునేవారు. బొప్పాయి పండ్లు తినరాదు తింటే సమస్య తీవ్రతరం అవుతుంది. ఇక బ్లడ్‌ షుగర్‌ సమస్యతో బాధపడేవారు బొప్పాయి పండు తినరాదు. తింటే రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలో ఇంకా పడిపోతాయి కనుక వారు తినరాదు. బొప్పాయి పండ్లు తినే పురుషులు వాటి విత్తనాలు తినకుండా అవి లోపలికి పోకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే అవి పురుషుల్లో వీర్యాన్ని నాశనం చేస్తాయి. ఇక బొప్పాయి పండును ఎవరైనా చాలా తక్కువగా తినాలి. రోజు తినవచ్చు.. కానీ ఒక కప్పుని మించి తినకూడదు. మించితే శరీరంలోని బెంజల్‌ ఇసోతయోసనెట్‌ అనే విష పదార్థం పేరుకుపోయి దాంతో తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. ఒక్కొక్కసారి ప్రాణాపాయం కూడా కలుగుతుంది. అందుకే బొప్పాయి పండ్లు తినేటప్పుడు మితంగా తినాలి.