ప్రతి ఒక్కరు ఎక్కువగా ఇష్టపడే ఆహార పదార్థాల్లో కోడిగుడ్డు కూడా ఒకటి. ఉడకపెట్టిన కోడి గుడ్డు అంటే అందరికీ మరీ ఎక్కువగా ఇష్టం ఉంటుంది. అయితే కోడి గుడ్డు వలన కలిగే ఆరోగ్య లాభాలు ఏంటి? కోడి కుటుంబం ఎందుకు తినాలి? అనే విషయాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. కోడి గుడ్డులో విటమిన్ సి, పీచు పదార్థం తప్ప మిగతా అన్ని పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు. సంపూర్ణ మాంసకృత్తుల పరంగా చూస్తే గుడ్డు మొదటి స్థానంలో తర్వాత పాలు, మాంసాహారం ఉన్నాయి. అయితే పప్పు మాంసాహారం లోని ప్రొటీన్‌ల కంటే గుడ్డులోనివి తేలికగా జీర్ణం అవుతాయి. ఇక బయట ఆహారం నుంచి వచ్చే అమైనో ఆమ్లాలు గుడ్డులో ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఒక కోడిగుడ్డులో 180 గ్రాముల కోలాస్ట్రాల్ ఉంటుంది. కోలస్ట్రాల్ నేరుగా రక్తంలో కలవకుండా గుడ్డులోని లెసిఫిన్ వంటి రసాయనాలు కాపాడతాయి. తెల్ల సొనలో 90 శాతం నీరు ఉంటుంది. మిగతా10 శాతంలో అల్బుమిన్, గ్లొబిలిన్ వంటి ప్రొటీన్‌లు ఉంటాయి.
కోడిగుడ్డు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు :
ప్రతి రోజు కోడిగుడ్డు తినటం వలన రక్తపోటుని నివారించవచ్చు. అంతేకాకుండా అధిక బరువు ఉన్నవారికి బరువు తగ్గడంలో ఇది సహాయపడుతుంది. ఎందుకంటే తెల్లసొనలోని ప్రోటీన్ కాస్త నెమ్మదిగా జీర్ణమవుతుంది. గుడ్డు తిన్న వెంటనే కడుపు నిండిన భావన ఏర్పడుతుంది. త్వరగా ఆకలి వేయకుండా చూస్తుంది. ప్రోటీన్ జీర్ణం కావడానికి కొంత శక్తి ఖర్చు అవుతుంది. దీంతో శారీరక బరువు తగ్గుతుంది. పెద్దవారిలో కండరాలు క్షీణించి కుండా కాపాడుతుంది. హార్మోన్ల విడుదలకు, ఎంజైమ్ల తయారీ శరీరం మరమ్మతులకు ప్రోటీన్ అవసరం. ఇంకా పసిపిల్లలకు ఏడు నుంచి ఎనిమిది నెలల నుంచే ఉడికించిన పచ్చ శాసన పెట్టొచ్చు. వారికి కావాల్సిన పోషకాలు అందులో దొరుకుతాయి. ఏడవది నిండే సరికి పూర్తి గుడ్డును మెత్తగా చేసి పిల్లలకి తినిపించి వచ్చు. ప్రతి ఒక్కరు వారానికి ఐదు నుంచి ఆరు గుడ్లు తినొచ్చని పోషక ఆహార నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు, గర్భిణులకు తప్పనిసరిగా నిత్యం ఒకటి గుడ్డు ఇవ్వడం మంచిది. గర్భంతో వున్నప్పుడు ప్రసవ అనంతరం పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు ఇలా ప్రతి దశలో గుడ్డు స్త్రీలకు ఎంతో మేలు చేస్తుందని పేర్కొంటున్నారు. మన శరీరానికి గుడ్డు వలన ఇన్ని రకాల ఆరోగ్య లాభాలు అనేవి ఉన్నాయి. కనుక మీరు కూడా రోజు ఒక గుడ్డు తినే ఆరోగ్యంగా ఉండండి.
