Bamboo Shoots : వెదురు పిలకలు తింటే ఇన్ని లాభాలా.. షుగర్ కంట్రోల్ నుంచి గుండె ఆరోగ్యం వరకు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా దేశాల్లో వందల ఏళ్ల నుంచి వెదురు పిలకలను వంటకాల్లో ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీనికి ప్రాధాన్యత పెరుగుతోంది. సాధారణంగా వెదురును మనం కర్రల కోసమే వాడుతుంటాం కానీ, వెదురు పిలకలు (Bamboo Shoots) ఆరోగ్యానికి ఒక గొప్ప వరమని శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది. యూకేలోని ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీ పరిశోధకుల ప్రకారం.. వెదురు పిలకలను ఆహారంగా తీసుకోవడం కలిగే ముఖ్య ప్రయోజనాలు ఇవే..
షుగర్ కంట్రోల్‌కు వెదురు పిలకలు:
రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి వెదురు పిలకలు (Bamboo Shoots) ఒక అద్భుతమైన ఆహారం. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండటం వల్ల, వీటిని తిన్నప్పుడు రక్తంలో షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరగవు. అలాగే ఇందులోని అధిక ఫైబర్ కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు ఉండే ఈ వెదురు పిలకలు డయాబెటిస్ బాధితులకు ఒక మంచి హెల్తీ ఆప్షన్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Also Read
- Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
పీచు పదార్థంతో జీర్ణక్రియ మెరుగు:
వెదురు పిలకల్లో పీచు పదార్థం (Fiber) అత్యధికంగా ఉంటుంది. ఇందులోని ఈ హై-ఫైబర్ కంటెంట్ కార్బోహైడ్రేట్లు అరగడాన్ని నెమ్మదింపజేస్తుంది, దీనివల్ల రక్తంలో షుగర్ లెవల్స్ స్థిరంగా ఉండటానికి సహాయపడుతుంది. కేవలం షుగర్ కంట్రోల్ చేయడమే కాకుండా, ఈ పీచు పదార్థం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ ఫైబర్ ఎంతో మేలు చేస్తుంది.
పోషకాల గని :
వెదురు పిలకలు లో-క్యాలరీ ఫుడ్ (తక్కువ కేలరీలు ఉండే ఆహారం) కావడంతో డయాబెటిస్ ఉన్నవారు వీటిని నిరభ్యంతరంగా తమ డైట్‌లో చేర్చుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. వీటిలో కొవ్వు తక్కువగా ఉన్నప్పటికీ.. పొటాషియం, సెలీనియం, విటమిన్ ఎ, బి6 వంటి అత్యవసర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తూనే, షుగర్ లెవల్స్‌ను పెంచకుండా ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడతాయి.
గుండె ఆరోగ్యం – కొలెస్ట్రాల్ నియంత్రణ:
వెదురు పిలకలు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఫైటోస్టెరాల్స్.. ఇతర కీలక పోషకాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడతాయి. తద్వారా రక్తప్రసరణ మెరుగుపడి, రక్తనాళాల్లో అడ్డంకులు కలగకుండా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు తగ్గుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. గుండెను భద్రంగా ఉంచుకోవాలనుకునే వారికి ఇది ఒక గొప్ప ప్రకృతి సిద్ధమైన ఆహారం.
నేచురల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు:
శరీరంలో అంతర్గత వాపులు, నొప్పులను తగ్గించే అద్భుతమైన ‘యాంటీ ఇన్‌ఫ్లమేటరీ’ లక్షణాలు వెదురు పిలకల్లో మెండుగా ఉన్నాయి. ఇవి శరీరంలోని కణాల నాశనాన్ని అడ్డుకుని, రోగనిరోధక శక్తిని (Immunity) పెంచడంలో తోడ్పడతాయి. ముఖ్యంగా వయసు పెరగడం వల్ల వచ్చే కీళ్ల నొప్పులు మరియు ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారించడంలో ఇవి కీలకంగా పనిచేస్తాయని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం శాస్త్రీయ అధ్యయనాలు, నిపుణుల అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. వెదురు పిలకలు (Bamboo Shoots) తీసుకోవడం లేదా మీ డైట్‌లో ఏదైనా మార్పులు చేసుకునే ముందు, ముఖ్యంగా మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా లేదా అలర్జీలు ఉన్నా తప్పనిసరిగా డాక్టర్ లేదా పోషకాహార నిపుణులను సంప్రదించాలి.
తాజావార్తలు
-
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
-
Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!