Site icon NTV Telugu

Harassment: స్లీపర్ కోచ్‌లో యువతికి వేధింపులు.. తన బాధను రెడ్డిట్లో పోస్ట్

Sleeper Class

Sleeper Class

ఓ మహిళ ప్రయాణికురాలు రైలులో ప్రయాణిస్తున్న వేళ.. తాను పడిన బాధను రెడ్డిట్లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ భారతదేశంలో ఒంటరిగా ప్రయాణించే మహిళల భద్రత గురించి మరోసారి లేవనెత్తింది. వివరాల్లోకి వెళ్తే.. వనాంచల్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ కోచ్‌లో వెళ్తున్న తనను.. ఓ వ్యక్తి ఎలా వేధించాడో తెలిపింది. తాను.. స్లీపర్ కోచ్‌లో ఒంటరిగా ప్రయాణించడం ఇదే తొలిసారి అని చెప్పింది. కోచ్లో ఇద్దరు మగ ప్రయాణికులు తన ముందు సీట్లోనే కూర్చున్నారని.. అంతా బాగానే ఉందని పేర్కొంది. అయితే.. ఓ వ్యక్తి తనను రకంగా చూడటం, ఈలలు వేయడం, కన్నుగీటడం, నవ్వడం లాంటివి చేశాడని.. తనకు అసౌకర్యంగా అనిపించిదని యువతి ఆరోపించింది.

Read Also: Akhilesh Yadav: ‘‘ఏం తమ్ముడు, నీకు వేరేలా ట్రీట్మెంట్ ఇవ్వాలా..?’’ జర్నలిస్టుకు అఖిలేష్ బెదిరింపు, వీడియో వైరల్..

ఓ వ్యక్తి ఫోన్‌లో మాట్లాడుతూ.. బిజీగా ఉంటే, మరో వ్యక్తి కన్నార్పకుండా తన వైపు చూస్తూ ఉన్నాడని బాధిత మహిళ ఆరోపించింది. అతను తన వైపు చూస్తూ ఉండడం.. తాను చూసి చూడనట్లు చూస్తున్నాని, ఫోన్లో రీల్స్ చూస్తున్నట్లు తెలిపింది. సుమారు 5-6 నిమిషాల పాటు చూసిన తర్వాత.. ఈల వేశాడని తెలిపింది. తాను అతని వైపు చూసే సరికి అతను కన్ను కొట్టుకుంటూ నవ్వడం ప్రారంభించాడని చెప్పింది. ఇదిలా ఉంటే.. కాసేపటి తర్వాత వాష్‌రూమ్ కు వెళ్తుండగా, ఆ వ్యక్తి పదేపదే ఈలలు వేస్తున్నాడని తెలిపింది. యువకుడితో ఉన్న మరో వ్యక్తి వద్దు అని చెప్పినప్పటికీ.. తన ప్రవర్తనను మార్చుకోలేదని రెడ్డిట్లో పేర్కొంది.

Read Also: Yogi Adityanath: “నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించను”.. అధికారులకు యోగి హెచ్చరిక

ఈ విషయం అంతటితో ఆగలేదు.. మహిళ తన స్టేషన్‌లో దిగడానికి తన వస్తువులను తీసుకుంటుండగా, యువకుడు ఆమె ఫోన్ నంబర్‌ను అడిగాడు. తాను పట్టించుకోకుండా రైలులోంచి దిగి వెళ్లిపోయినట్లు చెప్పింది. అదృష్టవశాత్తూ తన నాన్న ఫ్లాట్ ఫాం మీద ఉన్నాడని.. దీంతో ఊపిరి పీల్చుకున్నానని తెలిపింది. తాను ఇంటికి వెళ్లిన తర్వాత ఈ విషయం తలుచుకుని చాలా గట్టిగా ఏడ్చానని పేర్కొంది. ఆ వ్యక్తి చేసిన పనులకు అసహ్యం చెందానని.. అతను ఏదైనా చేస్తే, ఎవరూ సహాయం చేయకపోతే తన పరిస్థితేంటని? తెలిపింది. ఇక నుంచి.. తానెప్పుడు స్లీపర్ క్లాస్‌లో ఒంటరిగా ప్రయాణించనని రెడ్డిట్లో పేర్కొంది. ఈ ఘటనపై చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనల పట్ల పురుషులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ”సాక్ష్యంగా ఇలాంటివి జరుగుతున్నప్పుడు తెలివిగా వీడియో రికార్డ్ చేయడం మంచిదని మరొకరు చెప్పారు. ఇలాంటి విషయంలో భయపడవద్దని TTE, RPFకి ఫిర్యాదు చేయాలని తెలిపారు.

Exit mobile version