NTV Telugu Site icon

IPL 2023: కోహ్లీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ఏబీడీ

Abd, Kohli

Abd, Kohli

రన్ మిషీన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం గత ఫామ్ ను అందుకుని మెరుపులు మెరిపిస్తున్నాడు. అయితే ఏడాది క్రితం వరకు మాత్రం పరిస్థితి ఇలా ఉండేది కాదు.. 2019 తర్వాత ఫామ్ కోల్పోయి సుమారు మూడేండ్ల పాటు తన కెరీర్ లోనే అత్యంత గడ్డు కాలం గడిపిన సూపర్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గతేడాది ఆగస్టు నుంచి మళ్లీ మునపటి ఫామ్ ను అందుకుని వీరవిహారం చేస్తున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ తన అత్యుతమ ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. గతంలో మాదిరిగా కాకుండా కోహ్లీ ఇప్పుడు ప్రశాంతంగా కనిపిస్తున్నాడని.. అతడి మోహంపై నిత్యం నవ్వు కనిపిస్తుందని ఆర్సీబీ మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ అన్నాడు.

Read Also : Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం

కెప్టెన్సీ నుంచి విముక్తి పొందడం వల్లే విరాట్ కోహ్లీ ఇప్పుడు ప్రశాంతంగా కనిపిస్తున్నాడని.. అతని మోహంపై చిరు నవ్వు కనిపిస్తుందని అభిమానులు ముద్దుగా పిలుచుకునే మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ అన్నాడు. ప్రస్తుతం విరాట్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడని పేర్కొన్నాడు. ఇటీవల తనను కలిసిన విలేకరులతో డివిలయర్స్ కోహ్లీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అయితే చాలా కాలంగా కోహ్లీని చూస్తున్న మీకు.. అతడిలో ఏమైనా మార్పు కనిపించిందా.. అని విలేకరులు అడిగిన ప్రశ్నకు డివిలియర్స్ సమాధానమిస్తూ ఎలాంటి మార్పు లేదని చెప్పుకొచ్చాడు. టెక్నిక్ అలాగే బలంగా ఉంది. క్రీజులో చక్కగా కదులుతున్నాడు. ఇప్పటికీ అతడు బిజీ ప్లేయరే.. ఇటీవల కోహ్లీ ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలలో చూస్తూ అతడు చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నాడు.. ఎప్పుడు నవ్వుతూ ఉంటున్నాడు. కెప్టెన్సీ వదిలేయడం వల్లే కోహ్లీ సంతోషంగా ఉన్నాడని డివిలియర్స్ అన్నారు.

Read Also : Komatireddy venkat reddy: పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలను నమ్మొద్దు

భారత్ జట్టుతో పాటు ఆర్సీబీకి కెప్టెన్ గా ఉన్నన్ని రోజులు అతడి మీద తీవ్ర ఒత్తిడి ఉండేది.. సారథ్య బాధ్యతల వల్ల అతడు తన ఫ్రెండ్స్.. కుటుంబంతో ఎక్కువగా గడపలేకపోయడాడు.. కానీ ఇప్పుడు ఆ బాధ్యతలేమి లేవు.. అందుకే కోహ్లీ సంతోషంగా కనిపిస్తున్నాడు.. కోహ్లీ సరదాగా ఉంటే పరుగులు వాటంతట అవే వస్తాయి.. అని ఏబీడీ చెప్పాడు. కాగా ఐపీఎల్-16లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో కోహ్లీ రెచ్చిపోయాడు. ముంబై నిర్ధేశించిన 170 ప్లస్ టార్గెట్ ను డుప్లెసిస్ తో కలిసి అలవోకగా ఛేధించాడు. ఈ మ్యాచ్ లో 82 పరుగులతో కోహ్లీ నాటౌట్ గా నిలిచాడు. ఇక ఐపీఎల్ లో ఆర్సీబీ నేడు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో తలపడనుంది.