ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తమ కస్టమర్ల కోసం ఎన్నెన్నో కొత్త పథకాలను అమలు చేస్తుంది.. అందులో కొన్ని స్కీమ్ ల వల్ల జనాలకు మంచిది లాభాలు వస్తున్నాయి.. ఇప్పుడు తాజాగా ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అధిక వడ్డీ రేట్లు అందించేందుకు ఈ బ్యాంక్ సీనియర్ సిటిజన్ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ ఆఫర్ చేస్తోంది. అదే విధంగా సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్‌డీ స్కీమ్. ఈ కొత్త పథకం గడువు జులై 7, 2023తో ముగియనుంది. ఇప్పటికే గడువు ఇప్పటికే చాలా సార్లు పొడిగించిన విషయం తెలిసిందే.. అందుకే ఎక్కువ వడ్డీ కోరుకునే వారు ఈ పథకంలో ఇప్పుడే డిపాజిట్ చేయడం ద్వారా మంచి వడ్డీని పొందవచ్చు..
ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. ఈ సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్‌డీ పథకం ద్వారా కస్టమర్లు ఇతర పథకాలతో పోలిస్తే అదనపు వడ్డీ రేట్లను పొందవచ్చు. అలాగే సీనియర్ సిటిజన్లు 0.75 శాతం వరకు అదనపు వడ్డీ పొందే వీలుంటుంది. జనరల్ కస్టమర్లతో పోలిస్తే మాములుగా సీనియర్లకు 0.50 శాతం అదనపు వడ్డీ ఇస్తాయి.. ఈ స్కీమ్ వల్ల మరో 0.25 శాతం వడ్డీని బ్యాంక్ ఇస్తుంది.. ఇకపోతే ఈ పథకాన్ని మే 18, 2020న తొలిసారి ప్రవేశపెట్టారు. ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌తో ఇందులో డబ్బులు డిపాజిట్ చేయవచ్చు. అందువల్ల అధిక రాబడి కోరుకునే కస్టమర్లకు ఈ పథకం మంచిదని నిపుణులు చెబుతున్నారు..
ఈ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు సాధారణంగా 7 రోజుల నుంచి 10 ఏళ్ల టెన్యూర్లపై 3.5 శాతం నుంచి 7.75 శాతం వడ్డీ రేట్లు కల్పిస్తోంది. టెన్యూర్లను బట్టి ఈ వడ్డీ రేట్లు మారుతుంటాయి. గరిష్ఠంగా 35 నెలల టెన్యూర్‌పై 7.7 శాతం, 55 నెలల టెన్యూర్లపై 7.75 శాతం వడ్డీ రేట్లు అందిస్తోంది. 7.75 శాతం వడ్డీ రేటు ప్రకారం చూసుకుంటే పదేళ్ల టెన్యూర్‌లో మీ డబ్బులు రెండింతలు అవుతాయి. అంటే రూ. 5 లక్షలు పెట్టినట్లయితే మీ డబ్బులు మెచ్యూరిటీ నాటికి రూ. 10 లక్షలు వస్తాయి.. మీరు పెట్టే ప్రీమీయం ను బట్టి వడ్డీ మారుతుంది. ఉదాహరణకు మీరు లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మీకు చివరికి రెండు లక్షలు చేతికి వస్తాయి..