Nikhil Gowda: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది.. కాంగ్రెస్ వేవ్‌లో ఏకంగా 11 మంది మంత్రులు ఓటమి పాలయ్యారు.. ఇక, ఈ ఎన్నికల బరిలో దిగిన యంగ్ హీరోకి ఓటమి తప్పలేదు.. కాంగ్రెస్ దెబ్బకు పరాజయంపాలైన వారిలో కన్నడ యువ హీరో నిఖిల్ గౌడ అలియాస్ నిఖిల్ కుమారస్వామి కూడా ఒకరు.. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడైన నిఖిల్.. 10 వేలకు పైగా ఓట్లతో ఓటమి చవిచూశారు.. ఈఎన్నికల్లో కుమారస్వామి గెలిచినా.. తన కుమారుడికి మాత్రం విజయం దక్కలేదు..
Read Also: BJP: బీజేపీ ఓటు షేర్ పదిలం.. జేడీఎస్‌కు గండి కొట్టిన కాంగ్రెస్
రామనగర నియోజకవర్గం నుంచి జేడీఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన నిఖిల్ గౌడపై.. కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ హుస్సేన్ 10 వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు.. ఇక్బాల్ హుస్సేన్ కు 87,285 ఓట్లు రాగా, హీరో నిఖిల్ గౌడకు 76,439 ఓట్లు వచ్చాయి.. దీంతో.. 10,846 ఓట్లతో ఓడిపోయారు నిఖిల్ గౌడ.. భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థి గౌతం గౌడకు కేవలం 10,870 ఓట్లు వచ్చాయి. అయితే, రామనగర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కుమారస్వామి భార్యను పోటీలో పెట్టాలనుకున్నారు.. చివరి నిమిషంలో ఆమె ఈ స్థానాన్ని తన కుమారుడు నిఖిల్ గౌడ కోసం త్యాగం చేశారు. కానీ, కుమారుడు గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టలేకపోయారు.. అయితే, నిఖిల్‌కు ఇది రెండో ఓటమి.. ఎందుకంటే.. గతంలో మాండ్యా పార్లమెంటు స్థానానికి జరిగన బై పోల్‌లో నటి సుమలత చేతిలో తొలిసారి ఓడిపోయారు నిఖిల్ గౌడ. కాగా, ఈ సారి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మేం కింగ్ మేకర్లం కాదు.. కింగ్‌లము అంటూ చెప్పుకొచ్చిన కుమారస్వామి.. పార్టీ జేడీఎస్‌కు గట్టి షాక్ తగిలింది.. గతంలో తన తల్లి అనితా కుమారస్వామి ప్రతినిథ్యం వహించిన స్థానంలోనూ విజయాన్ని అందుకోలేకపోయారు నిఖిల్ గౌడ..