Andhra Pradesh: ఏపీలో భారీ విస్తరణకు హెచ్‌సీఎల్ సన్నాహాలు చేస్తోంది. మరో 15 వేల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేస్తోంది. మంత్రి నారా లోకేష్‌తో హెచ్‌సీఎల్ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో భారీ ఎత్తున విస్తరణ చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి లోకేష్‌కు హెచ్‌సీఎల్ ప్రతినిధులు వివరించారు. ఏపీలో విస్తరణ ద్వారా మరో 5500 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఫేజ్ 2లో భాగంగా నూతన కార్యాలయ భవనం నిర్మాణం చేపట్టి మరో పది వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హెచ్‌సీఎల్ ప్రతనిధులు తెలిపారు. గత ప్రభుత్వం నిలిపివేసిన రాయితీలు విడుదల చేయాల్సిందిగా లోకేష్‌కు హెచ్‌సీఎల్ ప్రతినిధులు వివరించారు.
Read Also: Minister Rama Naidu: వెలుగొండ ప్రాజెక్టు పటిష్టతపై మంత్రి నిమ్మల సంచలన కామెంట్లు
రాష్ట్రంలో గత ప్రభుత్వం నిర్వాకం వల్ల 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించాల్సిన సంస్థ.. కేవలం 4500 మంది వద్దనే ఆగిపోయిందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. పూర్తి స్థాయి అనుమతులు, రాయితీలు ఇవ్వకుండా నిలిపివేసి గత ప్రభుత్వం హెచ్‌సీఎల్ ప్రతినిధులను ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైందని.. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన మా లక్ష్యమన్నారు. హెచ్‌సీఎల్ కంపెనీ పూర్తి సామర్థ్యంతో కార్యకలాపాల విస్తరణకు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. ఇందుకు అవసరమైన అన్ని అనుమతులను త్వరితగతిన క్లియర్ చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో పెండింగ్ పెట్టిన రాయితీలను విడతల వారీగా చెల్లిస్తామన్నారు. మరో 15,500 మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా హెచ్‌సీఎల్ పని చేయాలని మంత్రి నారా లోకేష్ సూచించారు.
