HCA Scam: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆర్థిక కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్‌సీఏ స్కామ్‌లో అరెస్టు చేసిన నలుగురు నిందితులతో సహా అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు, సీఐడీ అధికారులు కస్టడీ కోరింది. దీనితో మల్కాజ్‌గిరి కోర్టు ఆరు రోజుల కస్టడీకి అనుమతినిచ్చింది. ఇప్పటికే చర్లపల్లి జైలులో ఉన్న నిందితులను జూలై 21 వరకు సీఐడీ కస్టడీలో ఉంచేందుకు అనుమతిచ్చిన కోర్టు, విచారణ దర్యాప్తు వేగవంతం కావాలని పేర్కొంది. ఇందులో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌తో పాటు మరో నలుగురు ఉన్నారు.
Read Also:CM Revanth Reddy : బనకచర్ల కడుతామని ఏపీ చెప్పలేదు.. మీటింగ్ పై సీఎం రేవంత్
నిందితులను రేపు ఉదయం చర్లపల్లి జైలు నుంచి తీసుకొని సీఐడీ విచారణ ప్రారంభించనుంది. హెచ్‌సీఏ నిధుల దుర్వినియోగం, అక్రమ లావాదేవీలపై విచారణ మరింత లోతుగా జరగనుంది. కోర్టు అనుమతితో సీఐడీ అధికారులు ఆర్థిక రికార్డులు, సాక్ష్యాలు సేకరించనున్నారు. మొత్తంగా, హెచ్‌సీఏలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు మరింత ఊపందుకోనుండగా.. నిందితులపై మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Read Also:Jasprit Bumrah: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లిన బూమ్రా..
