Site icon NTV Telugu

HCA New President: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ కొత్త అధ్యక్షుడి నియామకం.. ఎవరంటే..?

Hca

Hca

HCA New President: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలాక్సీ క్రికెట్ క్లబ్‌కు చెందిన అమర్నాథ్‌ నియామకమయ్యారు. గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కి జరిగిన ఎన్నికల్లో అమర్నాథ్‌పై కేవలం ఒక ఓటు ఆధిక్యంతో జగన్మోహన్ రావు విజయం సాధించారు. జగన్మోహన్ రావుకి 63 ఓట్లు రాగా.. అమర్నాథ్‌కి 62 ఓట్లు వచ్చాయి.. దీంతో జగన్మోహన్ రావు HCA ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు. శ్రీచక్ర క్రికెట్ క్లబ్‌ను సృష్టించి.. అక్రమ ఓటింగ్‌కి పాల్పడినట్టు వెలుగులోకి రావడంతో జగన్మోహన్ రావుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు.. ప్రెసిడెంట్ పదవి నుంచి జగన్మోహన్ రావును తొలగించారు. ఇప్పటివరకు HCA బాధ్యతలతను HCA అంబుడ్స్ మన్ రిటైర్డ్ జస్టిస్ సురేష్ కుమార్ నిర్వర్తించారు. తాజాగా.. HCA ప్రెసిడెంట్‌గా అమర్నాథ్ ను నియమిస్తూ అంబుడ్స్ మన్ తీర్పు వెలవరించారు.. వారం లోగా బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారు.

READ MORE: Stock Market: స్టాక్ మార్కెట్‌కు బిగ్ ఫెస్టివల్.. భారీ లాభాల్లో సూచీలు

Exit mobile version