హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) తన అసోసియేషన్ చరిత్రలో తొలిసారిగా మహిళా క్రికెటర్ల కోసం ప్రారంభ మహిళల T10 లీగ్‌ను ప్రారంభించినట్లు దాని అధ్యక్షుడు అర్షనపల్లి జగన్మోహన్ రావు తెలిపారు. సోమవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మహిళా లీగ్ ప్రారంభోత్సవంలో జగన్‌మోహన్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్‌లో 15 రోజుల పాటు జరిగే ఈ లీగ్‌లో దాదాపు 450 మంది మహిళా క్రికెటర్లు ఆడనున్నట్లు జగన్ తెలిపారు. ప్రతి జట్టు ప్రేరణ కోసం ఉప్పల్ అంతర్జాతీయ స్టేడియంలో కనీసం ఒక మ్యాచ్ ఆడేలా ఈ లీగ్ షెడ్యూల్ రూపొందించబడింది. భారత జట్టు మాజీ కెప్టెన్, హైదరాబాద్ దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ వంటి గొప్ప క్రికెటర్లను తయారు చేయాలనే ఆశయంతో ఈ లీగ్‌కు శ్రీకారం చుట్టామని చెప్పారు.
Minister Ramprasad Reddy: అమరావతి నిర్మాణానికి మంత్రి విరాళం
భవిష్యత్తులో తెలంగాణ అమ్మాయిలను టీమ్ ఇండియా, డబ్ల్యూపీఎల్ ఆడేలా చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. హైదరాబాద్‌లో అన్ని సౌకర్యాలతో కూడిన మహిళా క్రికెట్ అకాడమీని నెలకొల్పేందుకు తన సహచర అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో చర్చిస్తానని జగన్మోహన్‌రావు తెలిపారు. అయితే.. ఈ లీగ్ లో అండర్-15లో 12 జట్లు, అండర్-17లో 12 జట్లు, అండర్-19లో ఆరు జట్లు పోటీ పడుతున్నట్లు HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు వెల్లడించారు.
Pakistan: హౌసింగ్ స్కామ్ కేసులో మాజీ ఐఎస్ఐ చీఫ్ ఫైజ్ హమీద్ అరెస్ట్