Site icon NTV Telugu

HCA Elections: రేపే హెచ్‌సీఏ ఎన్నికలు.. బీఆర్ఎస్-బీజేపీ మద్దతుదారుల మధ్య పోటీ

Hca

Hca

రేపు హెచ్‌సీఏ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికలను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు తలపిస్తున్నాయి. పోటా పోటీగా ప్రెస్ మీట్ లు, ఒకరిపై ఒకరు ఆరోపణల పర్వం చేసుకుంటున్నారు. దీంతో హెచ్‌సీఏ ఎన్నికలకూ రాజకీయ రంగు పులుముకుంది. బీఆర్ఎస్-బీజేపీ మద్దతుదారుల మధ్య పోటీ కొనసాగుతుంది. యూనైటెడ్ మెంబెర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానెల్ పేరుతో జగన్మోహన్ రావు బరిలోకి దిగుతున్నారు. తమకు ప్రభుత్వ మద్దతు ఉందని ఆయన తెలిపారు. ఇక, HCA అధ్యక్షునిగా పోటీ చేస్తున్న జగన్ మోహన్ రావు.. HCA వైస్ ప్రసిడెంట్ గా శ్రీధర్, సెక్రటరీగా హరి నారాయణ రావు, ట్రెజరర్ గా శ్రీనివాస్ రావు, జాయింట్ సెక్రటరీగా నోయెల్ డేవిడ్, కౌన్సిలర్ గా వినోద్ అన్సార్, హమ్మద్ ఖాన్ పోటీలోకి దిగుతున్నారు.

Read Also:

అయితే, గుడ్ గవర్నెన్స్ ప్యానెల్ పేరుతో పోటీలోకి అనిల్ కుమార్ ప్యానల్ దిగుతుంది. బీజేపీ నేతలు, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు వివేక్ వెంకటస్వామి, వినోద్ వెంకటస్వామి మద్దతుతో అనిల్ కుమార్ అధ్యక్షునిగా పోటీ చేస్తున్నారు. హెచ్‌సీఏ వైస్ ప్రసిడెంట్ గా దళ్ జీత్ సింగ్.. సెక్రటరీగా ఆగం రావు, ట్రెజరర్ గా మహేంద్ర, జాయింట్ సెక్రటరీగా బసవ రాజు, కౌన్సిలర్ గా వినోద్ ఇంగ్లే బరిలోకి దిగుతున్నారు. మరో వైపు, క్రికెట్ ఫస్ట్ ప్యానెల్ పేరుతో హెచ్‌సీఏ ఎన్నికల బరిలోకి శివలాల్ యాదవ్, అర్షద్ ఆయూబ్ ప్యానల్ అధ్యక్షునిగా అమర్నాథ్ పోటీ చేస్తున్నారు. వైస్ ప్రసిడెంట్ గా జీ.శ్రీనివాస్, ట్రెజరర్ గా సంజీవి రెడ్డి, జాయింట్ సెక్రటరీగా చిట్టి శ్రీధర్, కౌన్సిలర్ గా సునీల్ అగర్వాల్ ఉన్నారు.

Exit mobile version