Site icon NTV Telugu

Anaganaga Oka Raju : ‘అనగనగ ఒకరోజు’ దీవాలి బ్లాస్ట్ ట్రైలర్ చూసారా.. నవ్వాగదు

Naveen Polishetty

Naveen Polishetty

తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నవీన్‌ పొలిశెట్టి, మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి దీపావళి ప్రత్యేక ప్రోమో విడుదలైంది. నవ్వుల టపాసులను తలపిస్తున్న ఈ ప్రోమో, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ అందరి  నవ్వులు  పూయిస్తోంది.

రెండు నిమిషాల ఇరవై ఎనిమిది సెకన్ల నిడివితో  వచ్చిన ఈ దీపావళి ప్రోమో, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. తనదైన కామెడీ టైమింగ్ తో నవీన్ పోలిశెట్టి అదరగొట్టాడు. హాస్యం, తాజాదనంతో నిండి, ప్రేక్షకులను మెప్పించే కథలను ఎంచుకోవడంలో నవీన్ మరోసారి తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. అలాగే ఈ చిత్రం నుండి మొదటి గీతం త్వరలో విడుదల కానుందని కూడా ప్రకటించారు మేకర్స్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ‘అనగనగా ఒక రాజు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో  మారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. నవీన్ పోలిశెట్టితో కలిసి ఆమె సరికొత్త వినోదాన్ని పంచనున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి, జె యువరాజ్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2026 జనవరి 14న విడుదల కానున్న ‘అనగనగా ఒక రాజు’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన దీపావళి ప్రోమో, ఆ అంచనాలను రెట్టింపు చేసింది.

 

Exit mobile version