Site icon NTV Telugu

Lucknow New Jersey: లక్నో కొత్త జెర్సీ చూశారా..!

Lsg

Lsg

లక్నో సూపర్ జెయింట్స్ కొత్త జెర్సీని రివీల్ చేసింది. రేపు (ఆదివారం) కోల్కతా నైట్ రైడర్స్తో జరగనున్న మ్యాచ్ లో ఆ జట్టు ఆటగాళ్లు ఈ మెరూన్ రంగు జెర్సీలో కనిపించనున్నారు. కోల్ కతాలోని ప్రముఖ ఫుట్ బాల్ క్లబ్ మోహన్ బగాన్కు గౌరవార్థంగా లక్నో ఆటగాళ్లు ఈ స్పెషల్ జెర్సీ వేసుకోనున్నారు. మోహన్ బగాన్ క్లబ్ యజమాని సంజీవ్ గోయెంకా.. ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నోకు యజమానిగా ఉన్నారు.

Read Also: Bihar: చెప్పుడు మాటలు విని కన్న కూతురిని హత్య చేసిన తండ్రి..

కేకేఆర్‌ను ఎదుర్కొనేందుకు ఫ్రాంచైజీ మరోసారి మెరూన్ మరియు గ్రీన్ జెర్సీలో రంగంలోకి దిగేందుకు సిద్ధమైంది. ఇంతకు ముందు.. గత సీజన్ లో కోల్కతాతో లక్నో తలపడినప్పుడు కూడా జెర్సీని మార్చారు. ఇక ఈ ప్రత్యేక జెర్సీ పాన్ పసంద్ చాక్లెట్లా ఉందంటూ క్రికెట్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Read Also: Bournvita: బోర్న్‌విటాలో చక్కెర చేదును మిగిల్చిందా..? “హెల్త్ డ్రింక్” ట్యాగ్ ఎందుకు కోల్పోయింది..?

ఇదిలా ఉంటే.. శుక్రవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో లక్నో ఘోర ఓటమిని చవిచూసింది. 160 ప్లస్ పరుగులు చేసిన లక్నో ఓడిపోవడమంటే ఇదే తొలిసారి. అయితే.. కేకేఆర్ తో జరిగే మ్యాచ్ లో మళ్లీ విజయాల బాటలో నడవాలని లక్నో సూపర్ జెయింట్స్ ఈ నిర్ణయం తీసుకుంది.

Exit mobile version